చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి

Jun 15,2024 22:12

ప్రజాశక్తి – తిరువూరు : విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని జనవిజ్ఞాన వేదిక (జెవివి) మండల ప్రధాన కార్యదర్శి డి.సుదర్శన్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణ పక్షోత్సవాల్లో భాగంగా తిరువూరు మండలంలోని గానుగపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం పొగాకు ఉత్పత్తుల వినియోగం – నష్టాలు అనే అంశంఫై రూపొందించిన కరపత్రాలను శనివారం ఆయన పంపిణీ చేశారు. చిన్న వయసులోనే కొందరు సిగరెట్‌, బీడీ వంటి పొగాకు ఉత్పత్తులని వినియోగిస్తున్నారని, మద్యానికి బానిసలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్‌ ప్రధానోపాధ్యాయులు వి.సాయిరాం, జెవివి జిల్లా కార్యదర్శి ఎం.రాంప్రదీప్‌, ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్‌, వెంకటేశ్వర్లు, రాము తదితరులు పాల్గొన్నారు.

➡️