చింతలపాడులో బడిబాట

May 26,2024 20:57

ప్రజాశక్తి – తిరువూరు : వివిధ పాఠశాలల్లో పిల్లలు నమోదు నూటికి నూరు శాతం ఉండాలనే లక్ష్యంతో బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆంగ్ల భాషా ఉపాధ్యాయ సంఘ కన్వీనర్‌ ఎం.రాం ప్రదీప్‌ తెలిపారు. తిరువూరు మండలంలోని ఆదివారం చింతల పాడులో జరిగిన బడిబాట కార్యక్ర మంలో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలల్లో పిల్లల నమోదు నూరు శాతం ఉన్నప్పటికీ, ఉన్నత విద్యలో ఆ స్థాయి నమోదు కన్పించడం లేదని తెలిపారు. గానుగపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల బలోపేతానికి తల్లిదండ్రులు సహకరిం చాలని ఆయన కోరారు.

➡️