దాడిలో గాయపడిన బాలికకు అండగా..

May 19,2024 20:34

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : ఎన్నికల ప్రచార ముగింపు సందర్భంగా మండలంలోని తిరుమలగిరిలో తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ కార్యకర్తలపై అమానుషంగా దాడులు చేశారు. ఈ క్రమంలో పలువురు వైసిపి కార్యకర్తలు, మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. లాస్య (12 సం) అనే బాలికకు తలకు బలమైన గాయం అయింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన ఆమెను వెంటనే విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటలకు తరలించారు. వైద్యులు తలకు ఆపరేషన్‌ చేయాలని, దాదాపు రూ. లక్ష రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పడంతో బాలిక తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. విషయం తెలుసుకున్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్‌ బాబు ఖర్చు మొత్తం తానే భరిస్తానని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. బాలిక హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్‌ అవ్వడంతో విషయం తెలుసుకున్న ప్రసాద్‌ బాబు ఆదివారంం లాస్యను పరామర్శించి ధైర్యం చెప్పారు.

➡️