కోటయ్య కుటుంబ సభ్యులకు పరామర్శ

May 18,2024 14:40 #ntr district

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలోని 6 వ వార్డులో పాముల కోటయ్య బాబు సంస్మరణ కార్యక్రమంలో నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్ మోహన్ రావు పాల్గొన్నారు. కోటయ్య చిత్రపటానికి ఎంఎల్ఎ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోటయ్య కుటుంబ సభ్యులను ఎంఎల్ఎ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️