కనుమరుగవుతున్న కందిసాగు

Jun 16,2024 21:34
  • చుక్కలంటుతున్న కందిపప్పు ధర
  • సాగుపై ఆసక్తి చూపని రైతులు

: ప్రతి ఇంటిలోనూ పప్పు నిత్యావసరమే. వాణిజ్య పంటల మోజులో పడి ఆపరాల సాగు నేడు కనుమరుగైపోయింది. గతంలో కంది, పెసర, మినుము, బొబ్బర్లు పంట సాగు చేసేవారు. కాలక్రమేణా ఆపరాలపై రైతులు పూర్తిగా ఆసక్తి తగ్గించారు. మరోవైపు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ పంటకు పెట్టిన పెట్టుబడులు రాని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా పత్తి, మిరప కొంచెం ఆదాయం కూడా ఎక్కువగా ఉందనేది రైతుల నమ్మకం. అందువల్ల ఆపరాల సాగు పూర్తిగా తగ్గిపోయింది.మందకోడిగా సాగు…మండలంలో కౌలు రైతులు 2,500 మందికి పైగా ఉన్నారు. రైతులు వెయ్యికి పైగా ఉన్నారు. మండల వ్యాప్తంగా 10,000 ఎకరాలకు పైగా వ్యవసాయం సాగు చేస్తున్నారు. దీంతో మిర్చి, పత్తి పంటలపైనే మక్కువ చూపిస్తున్నారు. గతంలో కంది పంట కూడా సాగు చేసేవారు. నేడు ఏ గ్రామంలో చూసినా పత్తి, మిర్చి పంటలే దర్శనమిస్తున్నాయి, దీనికి తోడు అక్కడక్కడ జొన్న పంటలు కూడా కనిపిస్తున్నాయి. రైతులు 10 సంవత్సరాల క్రితం పత్తిలో కూడా కంది సాగు చేపట్టేవారు. రాను రాను చీడపీడలు అధికంగా రావడంతో సాగు పట్ల రైతులు మక్కువ చూపటం లేదు. దీంతో మండల స్థాయి కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా కంది సాగు కనుమరుగై పోయింది. మార్కెట్లో కందిపప్పు ధర చుక్కలు చూస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం కందు సాగును ప్రోత్సహించడం లేదు. ఏ గ్రామంలో చూసినా కంది సాగు పూర్తిగా కనుమరుగైపోయింది గతంలో రైతులు పత్తి సాగు చేస్తున్నప్పుడు ఐదు వరసలకు ఒకసారి కందిసాగు చేపట్టేవారు. అంతేకాకుండా గట్ల వెంబడి మిరప మొక్కలు, గోంగూర, బంతిపూలు సాగు చేసేవారు. కందికే ఆశించిన తెగుళ్లు మిగతా పంటలపై ప్రభావం చూపడంతో కంది సాగుపై ఆసక్తి పూర్తిగా తగ్గిపోయింది. గతంలో 10 గ్రామాల్లో 100 ఎకరాలకు పైగా కంది సాగు చేపట్టేవారు. మండల స్థాయిలో 10 ఎకరాలో కూడా కంది సాగు చేపట్టడం లేదు. కంది సాగు చేసినప్పుడు ప్రతి రైతు ఇంట్లో కందులు పుష్కలంగా ఉండేవి. నేడు మార్కెట్లో, కిరాణా దుకాణాల్లో, కేజీ కందిపప్పు 160 రూపాయలకు కొనుగోలు చేసుకుని వస్తున్నారు. గ్రామీణ ప్రాంతం సైతం కూడా దుకాణాల్లో కందిపప్పును కొనుగోలు చేస్తున్నారు. రైతుల ఇళ్లల్లో పండిన కందులను బంధువులు కూడా పంపించేవారు.

➡️