బ్రహ్మోత్సవాలు ముగింపు

May 26,2024 21:04

ప్రజాశక్తి – జగ్గయ్యపేట: మండలంలోని వేదాద్రి గ్రామంలో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుండి 25 వరకు దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త డాక్టర్‌ వి.ఎల్‌.ఇందిరాదత్తు ఆధ్వర్యంలో శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ట్రస్టు, కె.సి.పి సహాయ సహకారంతో జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజు శనివారం రాత్రి ముగిసాయి. శ్రీ స్వామి కళ్యానోత్సవాల సందర్భంగా ఇందిరాదత్తు సుమారు 3 కేజీల బంగారంతో శ్రీ రాజ్యలక్ష్మీ అమ్మవారికి కీరిటం, కర్ణాలు, హస్తాలు, శ్రీ చెంచు లక్ష్మీ అమ్మవారికి కీరిట, హస్తాలు, సుమారు 2.50 కేజీల వెండితో నరసింహ స్వామి విగ్రహం తయారు చేయించారు. గుంటూరు జిల్లాలోని ఉల్లిందన గ్రామస్తులకి, కళ్యాణం రోజు రాత్రి అన్నదానం నిర్వహించిన దాతలు కందులవారిపాలెం, హైదరాబాదు, కట్టమూరు గ్రామస్తులకు, హేమాద్రి సిమెంట్స్‌ ఫ్యాక్టరీ, రాంకో సిమెంట్‌ ఫ్యాక్టరి వారికి దన్యవాదములు తెలిపారు.

➡️