కేన్సర్‌ బాధితురాలికి ఆర్థికసాయం

May 18,2024 19:25

ప్రజాశక్తి – తిరువూరు : కేన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ కుటుంబానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి చొరవతో దాతల ద్వారా సేకరించిన రూ.1.50 లక్షల ఆర్థిక సహాయాన్ని విద్యాశాఖ అధికారులతో కలిసి అందజేశారు. తిరువూరు కోర్టు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాల స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ అర్‌.రుక్మిణీ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఆమెది పేద కుటుంబం. అదే పాఠశాలల్లో కొడుకు ఆరో తరగతి చదువుతున్నారు. కుమార్తెకు మానసిక ఎదుగుదల లేదు. భర్త రోజువారీ కూలి పనులకు వెళుతుంటాడు. అయన సంపాదనతోనే కుటుంబం జీవిస్తుంది. రుక్మిణీకి బ్లడ్‌ కాన్సర్‌కు ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన అమౌంట్‌ కంటే అదనంగా రూ.నాలుగు లక్షలు ఆసుపత్రికి కట్టాల్సి ఉంది. రోజు భోజనం కూడా కొనలేని పరిస్థితి కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.రమేష్‌ స్పందించి తోటి ఉపాధ్యాయులు సహకారంతో సోషల్‌ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా కొంతమంది దాతల వద్దకెళ్లి మొత్తం రూ.1,50,490 సొమ్మును సేకరించి శనివారం విద్యాశాఖ అధికారుల చేతుల మీదగా ఆమె భర్తకు అందజేశారు.

➡️