‘బడికి పోతా’ కార్యక్రమం

Jun 15,2024 22:11

ప్రజాశక్తి – జగ్గయ్యపేట: నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా శనివారం తిరుమలగిరి జంగాల కాలనీలో బడికి రాని విద్యార్థుల తల్లిదండ్రులకు, తిరుమలగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సదుపాయాలు గురించి తెలియజేసి ఇంకా బడిలో చేర్చని 6సంవత్సరాల నుండి 14సంవత్సరాల వయసున్న విద్యార్థులను తప్పనిసరిగా బడిలో చేర్చాలని వారికి అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మహిళ పోలీస్‌ పవిత్ర, ఉపాధ్యాయులు ప్రసాద్‌ బాబు, రత్నం మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

➡️