దుర్గమ్మకు బంగారు హారం

Jun 16,2024 21:32

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ముంబైకు చెందిన అహిల్య వసంతరావు పాటిల్‌, కుటుంబ సభ్యులు అమ్మవారి అలంకరణ నిమిత్తం కానుకగా 59 గ్రాముల బరువు గల బంగారు హారంను ఆలయ అధికారులను కలిసి ఆదివారం దేవస్థానానికి అందజేశారు. ఆలయ అధికారులు దాత కుటుంబానికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించగా, వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.

➡️