దుర్గగుడి కళావేదికపై ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

May 21,2024 20:30

ఇంద్రకీలాద్రి దుర్గగుడి మహామండపం ఆరో అంతస్తులోని కళావేదికపై ధర్మపథం కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అమ్మవారి కొండపైన కళావేదికపై విశాఖపట్నంకు చెందిన కళావధామ మ్యూజిక్‌ అండ్‌ డాన్స్‌ అకాడమీ నిర్వాహకులు తాళ్ళపాక సందీప్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. సుమారు 15 మంది కళాకారులు తమ నాట్య ప్రదర్శనలతో అలరించారు. పుష్పాంజలి, కృష్ణ శబ్ధం, సరస్వతీ, లలితా హవతి, బొమ్మ బొమ్మ వంటి పాటలకు కళాకారిణులు ప్రదర్శనలతో ఆహూతులను ఆకట్టుకున్నారు.

➡️