.అసభ్యకర పోస్టులు సరికాదు

Apr 14,2024 22:47
  • వైసిపి సెంట్రల్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి వెలంపల్లి

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : సిఎం జగన్‌పై దాడి నేపథ్యంలో టిడిపి అసభ్యకర పోస్టులు సరికాదని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆదివారం పశ్చిమ నియోజకవర్గం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ శనివారం సిఎం జగన్‌పై దాడి జరిగితే సోషల్‌ మీడియాలో టీడీపీ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కంటికి దెబ్బ తగిలితే బోండా ఉమా బ్యాచ్‌ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, ఎవరైనా కంటిని పొడుచుకొని ఆట్లాడతారా,సానుభూతి చూపకపోయినా పర్వాలేదు కానీ విమర్శలు చేయడం సరికాదని అన్నారు. తన కుటుంబం ఎవరికీ హాని చేయలేదని అని అన్నారు. అధికారంలో లేకుండానే టీడీపీ బరితెగిస్తుదని అన్నారు. సెంట్రల్‌ నియోజకవర్గంలో బోండా ఉమా అరాచకాలకు హద్దు ఆపు లేకుండా పోయిందని ఆయన అరాచకాలను అడ్డుకట్ట వేయాలని అన్నారు. ఎలక్షన్‌ కోడ్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎలక్షన్‌ కమిషన్‌ పరిధిలో ఉంటుందని తక్షణమే ఎలక్షన్‌ కమిషన్‌ చర్య తీసుకోవాలని కోరారు.

➡️