దుర్గగుడి అభివృద్ధి పనుల పరిశీలన

May 21,2024 20:27

 ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొండ కింద, పైన జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మంగళవారం పరిశీలించారు. దుర్గగుడి కార్యనిర్వాహణాధికారి కె.ఎస్‌.రామారావు, టెక్నికల్‌ కమిటీ నిపుణులు ఆర్‌.కొండలరావు ఆధ్వర్యంలో టెక్నికల్‌ సభ్యులు – సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజీ, విజయవాడ సివిల్‌ డిపార్ట్‌మెంట్‌ డీన్‌ పాండురంగారావు, రమేష్‌ కుమార్‌, పి.త్రిమూర్తి రాజు, శ్రీనివాస్‌, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వాహక ఇంజినీరింగ్‌ బృందంతో కలిసి జరుగుచున్న పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆలయ ఇఒ, ఇంజినీరింగ్‌ బృందం వారికి తగిన సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్‌ రమాదేవి, డిఈఈలు, ఏఈఈలు , ఇంజినీరింగ్‌ సిబ్బంది పాల్గొన్నారు.

➡️