జగన్‌ జోలికి వస్తే సహించం

Apr 15,2024 22:21
  • వైసిపి పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్‌

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : టిడిపి, జనసేన, బిజెపి కూటమికి దమ్ముంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రండి… ఓటమి భయంతో సీఎం జగన్‌పై హత్యాయత్నం చేయడం సిగ్గుచేటు… జగన్‌ జోలికి వస్తే సహించం’ అని వైసిపి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ అన్నారు. ఆయన సోమవారం 50వ డివిజన్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్లుగా సిఎం వైఎస్‌ జగన్‌ పాలనలో అందిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆసిఫ్‌ మీడియాతో మాట్లాడుతూ ఓటమి భయంతోనే చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కళ్యాణ్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ తెచ్చేలా భౌతికదాడులకు పురిగొల్పుతున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు చెప్పుకోవడానికి తాను చేసిన ఒక్క మంచి పని కూడా లేకపోవడంతో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌ తన స్థాయిని మరిచి, సీఎం స్థాయిని గౌరవించకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని, అన్నారు. 50వ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ బంక విజయమ్మ, కార్పొరేటర్లు చలపతిరావు, అప్పాజీ, కోటిరెడ్డి, నాయకులు దేవి పలమాంబ పాల్గొన్నారు.వెలంపల్లిని పరామర్శించిన పోతినప్రజాశక్తి – వన్‌టౌన్‌ : రాళ్లదాడిలో గాయ పడిన వెలం పల్లి శ్రీనివాస రావును వైసిపి పశ్చిమ నాయకులు పోతిన మహేష్‌ సోమవారం పరామర్శిం చారు. వెలంపల్లి నివాసంలో ఆయనను కలిశారు. మహేష్‌ వెంట జల్లి రమేష్‌, బొట్ట సాయికుమార్‌, నెమల సంజీవరావు, సుఖాసి భాను, సోమీ మహేష్‌ ఉన్నారు.

➡️