పశ్చిమ సీటుకై జనసేన నిరసన

Mar 18,2024 14:33 #ntr district

పోతిన వెంకట మహేష్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులు

ప్రజాశక్తి-వన్ టౌన్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సీటును ఆ పార్టీ పశ్చిమ ఇన్చార్జి, నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ కు కేటాయించాలని కోరుతూ పార్టీ శ్రేణులు సోమవారం కూడా పట్టు విడవకుండా నిరసన కార్యక్రమం నిర్వహించారు. న్యాయం, ధర్మం ఉంటే పోతిన వెంకట మహేష్ కి పశ్చిమ అసెంబ్లీ సీటును కేటాయించాల ని ప్లే కార్డ్స్ పట్టుకుని వన్ టౌన్ నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటును జనసేన పార్టీ పశ్చిమ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ కి కేటాయించాలని పశ్చిమ జనసేన యువత ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

➡️