అగ్రగామిగా కొండపల్లి జెడ్‌పి హైస్కూల్‌ విద్యార్థినులు

Apr 13,2024 22:36

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఇంటర్మీ డియేట్‌ ఫలితాల్లో వ్యక్తిగత స్కోరులో ఎన్టీఆర్‌ జిల్లాలో కొండపల్లి జెడ్‌పి (గర్ల్స్‌)హై స్కూల్‌ ప్లస్‌ విద్యార్థినులు అగ్రగామిగా నిలిచారు. జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న ఎమ్‌పిసి విద్యార్థిని ఎన్‌.కల్యాణి 444/470 మార్కులతోనూ, సిఇసి గ్రూప్‌లో విద్యార్థిని ఎన్‌.శ్రావణి 446/500 మార్కులతో జిల్లా ప్రథమ స్థానాలు సాధించి హైస్కూల్‌ ప్లస్‌కు మంచి పేరు సంపాదించి పెట్టారని ఉపాధ్యా యులు కొనియాడారు. నందిగామ ఉప విద్యాశాఖాధికారి ఎ.వెంకటప్పయ్య, పిజిటి.ఉపాధ్యాయ బృందాన్ని అభినందిస్తూ, విజేతలైన ఇరువురి విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ ఇద్దరు ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు బి.పద్మలత పాఠశాల ద్వితీయస్థానం సాధించి విద్యార్థినీ ఆర్‌.మణితేజతో సహా ముగ్గురిని దుశ్శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఎస్‌ఎమ్‌సి చైర్‌పర్సన్‌ ఎన్‌.పుష్ప విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఇంకా మంచి ఫలితాలు వచ్చే సంవత్సరం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️