సిపిఐ అభ్యర్థి గెలుపుకోసం- మహిళా దళం ప్రచారం

Apr 24,2024 22:29

ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న ప్రజా గొంతుక విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్ధి జీ.కోటేశ్వరావును గెలిపించాలని మహిళా సమాఖ్య నాయకురాలు పంచదార్ల దుర్గాంబ అన్నారు. బుధవారం విజయవాడ 43,56 డివిజనులో జీ.కోటేశ్వరరావు గెలుపు కోసం మహిళా దళం ప్రచారం చేసింది. అందరిని కదలిస్తూ.. కలిసి ముచ్చటిస్తూ కంకికొడవలి గుర్తు పై ఓటు వేసి జీ.కోటేశ్వరావును గెలిపించాలని అభ్యర్ధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమ్యూనిస్టులు చట్టసభల్లో ఉంటే ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వాలను నిలదీస్తారని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే వారిని గెలిపించాలన్నారు. బీజేపీ, వైసీపీ, టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసే సిపిఐ అభ్యర్థి జి.కోటేశ్వరరావును గెలిపించాలని కోరారు. ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతూ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న మోడీకి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. భారీ మెజారిటీతో జీ.కోటేశ్వరరావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నగర నాయకులు ఓ.రాణి, తమ్మిన దుర్గ, డీ. సీతారామమ్మ, డీరమణమ్మ, మూలి ఇందిర, ఎన్‌. భాగ్యలక్ష్మి, చింతాడ పార్వతీ, అండిమాని నాగమణి, కొట్టు విజయ లక్ష్మి ఏ. తావుడమ్మ, వెలంగాని రాణి, అనసూయ, సావిత్రి, భువన సుందరి తదితరులు పాల్గొన్నారు.

➡️