సింగ్ నగర్ లో మట్టల పండుగ

Mar 24,2024 12:03 #ntr district

ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : క్రైస్తవులు పవిత్రంగా నిర్వహించే గుడ్ ఫ్రైడే ముందు మట్టల ఆదివారం ఘనంగా నిర్వహించినారు. సింగ్ నగర్ ప్రాంతాలలో ఆర్ సి ఎం సీఎస్ఐ పెంతుకోస్తు తదితర సంఘాల చర్చిలలో ఘనంగా మట్టల ఆదివారం పురస్కరించుకొని చర్చల సమీపంలో భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు పవిత్రంగా భావించే కార్యక్రమం కొబ్బరి ఆకులకు ఈతముండలకు పూలతో ప్రత్యేకంగా అలంకరణ చేసి క్రైస్తవ మత విధానాన్ని భక్తితో దావీదు తనయ హోసన్న అని నినాదంతో చర్చలు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రోమన్ క్యాథలిక్ మిషన్ ఆధ్వర్యంలో సింగ్ నగర్ పాయకాపురం చర్చలలో పాస్కల్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ విజయ కుమార్ ఫాదర్ జోజి ఫాదర్ కిరణ్ కుమార్ తదితరులు ప్రసంగించారు. దీనిలో సెంటెన్స్ సిస్టర్స్ సంఘ పెద్దలు యూత్ మహిళలు పాల్గొన్నారు.

➡️