మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ షోరూమ్‌ ప్రారంభం

May 5,2024 21:44

ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ నూతన షోరూమ్‌ ఆదివారం ఉదయం ఎం.జి.రోడ్డులో డిప్యూటీ మేయర్‌ బెల్లం దుర్గ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా ఆభరణాలను అందించడంలో మలబార్‌ సంస్థ ప్రముఖంగా ఉందని తెలిపారు. గతంలోనే మలబార్‌ షోరూమ్‌ విజయవాడ నగరంలో ఉందని, అయితే అత్యాధునికంగా ఆధునీకరించి నూతన షోరూమ్‌ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. మలబార్‌ గ్రూప్‌ చైర్మన్‌ ఎం.పి. అహ్మద్‌ మాట్లాడుతూ అత్యంత ఆధునికంగా, ఆకర్షణీయంగా విజయవాడ షోరూమ్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. విశాలమైన ప్రదేశంతో విస్తారమైన ఆభరణాల సేకరణను కలిగిఉందని తెలిపారు. షోరూమ్‌ ప్రారంభం సందర్భంగా ప్రత్యేకమైన బ్రాండ్‌ మైన్‌ డైమండ్‌ జ్యూయలరీ, ఎరా అన్‌ కట్‌ జ్యూయలరీ, ఎథిక్స్‌ హ్యాండ్‌ కట్‌ జ్యూలయరీ ఆభరణాలు ప్రదర్శనగా ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అక్షయ తృతీయ సందర్భంగా కూడా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు, షోరూమ్‌ ఉద్యోగులు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.

➡️