పింఛన్లు ఇండ్ల వద్దే….!

Jun 1,2024 11:02 #ntr district

ప్రజాశక్తి-గంపలగూడెం: మండల వ్యాప్తంగా 21 సచివాలయాల పరిధిలో 3,041 మంది పింఛన్లను గృహాల వద్ద అందజేస్తున్నట్లు గంపలగూడెం ఎంపీడీవో పీవీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల అనే పద్యంలో ప్రతి లబ్ధిదారునికి వారి వారి ఎకౌంటులకు బదలాయింపు జరుగుతున్న విషయం తెలిసింద్దే. అయితే కొందరికి సాంకేతిక లోపాలతో జమ కాని వారు ఎవరైతే ఉన్నారో పింఛన్దారులకు ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగులు అందజేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే దాదాపు అన్ని సచివాలయాల్లో పింఛన్ ఇచ్చే కార్యక్రమం ప్రారంభమై కొనసాగుతుందన్నారు.

➡️