పోలింగ్‌ సజావుగా జరగాలి

May 3,2024 21:53

ప్రజాశక్తి కలక్టరేట్‌ ( కష్ణా) : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలకు ఈ నెల 13వ తేదీ పోలింగ్‌ జరగనున్న దష్ట్యా ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, న్యాయ సమ్మతంగా నిర్వహించేందుకు పోలింగ్‌ సజావుగా జరిగేలా చూడడానికి, సంఘ వ్యతిరేక శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి, సిఆర్‌ పి.సి 144 సెక్షన్‌ కింద ఈనెల 11వ తేదీ నుండి కృష్ణా జిల్లాలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిషేధ ఆజ్ఞలు జారీ చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డ జిల్లా మేజిస్ట్రేట్‌ శ్రీ డీకే బాలాజీ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడడాన్ని నిషేధించడంతో పాటు అన్ని రకాల కర్రలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తూ సెక్షన్‌ 144(2) సిఆర్‌ పిసి కింద ఉత్తర్వులు జారీ చేశారు. పేలుడు ఆయుధాలు లేదా ఏదైనా ఇతర ఆయుధాలు, రాళ్లు మొదలైనవి, మొత్తం కష్ణా జిల్లా అధికార పరిధిలోని పార్లమెంటు, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు సాధారణ ఎన్నికల కోసం ఏర్పాటుచేసిన అన్ని పోలింగ్‌ స్టేషన్ల వద్దకు తీసుకెళ్లడాన్ని నిషేధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందు బహిరంగ సభలు, ఊరేగింపులు, అన్ని రకాల ప్రచారాలు నిషేధించబడ్డాయని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.ఈ ఉత్తర్వులు కృష్ణాజిల్లాలో ఈ నెల 11 నుండి పోలింగ్‌ పూర్తయ్యే వరకు అమలులో ఉంటాయని జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

➡️