పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత

Jun 5,2024 17:20 #ntr district

ప్రజాశక్తి-విజయవాడ : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా విడనాడితే మానవాళికి మంచి రోజులు వస్తాయని అంగన్ వాడీల బృందం పేర్కొంది. పర్యావరణ దినోత్సవ సందర్భంగా విజయవాడలో 50వ డివిజన్ లో అంగన్ వాడీ కేంద్రాలలో మొక్కలు నాటారు. ‘మొక్కలను పెంచండి.. పర్యావరణాన్ని రక్షించండి’, ‘భూతాపాన్ని నియంత్రిద్దాం… విపత్తుల నుంచి బయటపడతాం’, ‘అడవులను కాపాడుకుందాం.. విపత్తుల నుంచి జన జీవనాన్ని రక్షిద్దాం’ అని వారు పిలుపునిచ్చారు. మనిషితోపాటుగా ప్రకృతిలోని వన్యప్రాణులు సైతం అంతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

➡️