విస్సన్నపేటలో గ్రామీణ బంద్

Feb 16,2024 10:33 #ntr district

ప్రజాశక్తి-విస్సన్నపేట : విస్సన్నపేట గాంధీ బొమ్మ సెంటర్లో దేశవ్యాప్త గ్రామీణ బంద్ సందర్భంగా రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు  సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో రైతంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టి నల్ల చట్టాలు తీసుకురావడం దానిమీద పోరాడిన రైతుల్ని చంపటం రైతులకు గిట్టుబాటు ధర లేకుండా చేయటం కార్మిక చట్టాలను మార్చి కార్పొరేట్లకు దోచిపెట్టడం చేస్తున్నారు. ఉపాధి హామీ పూర్తిగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ నిధులు తగ్గించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు మేకల జ్ఞాన రత్నం ,తాపీ వర్కర్ సీనియర్ మండల అధ్యక్షులు మర్రిపోయిన అప్పారావు సంఘ గౌరవ అధ్యక్షులు గంజిన బోయిన రాము సెక్రెటరీ పోతురాజు శ్రీనివాసరావు సిఐటియు మండల సెక్రెటరీ షేక్ బాషా సగుర్తి శ్రీనివాసరావు రైతు సంఘం మండల నాయకులు పులి వల్ల ఏడుకొండలు బొన o శివ పోతురాజు సత్యనారాయణ కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

➡️