రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా

May 26,2024 21:03

ప్రజాశక్తి – జగ్గయ్యపేట : ఎన్టీఆర్‌ కమిషనరేట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ పి.హెచ్‌.డి రామకృష్ణ ఆదేశాల మేరకు నందిగామ సబ్‌ డివిజన్‌ వ్యాప్తంగా డిసిపి కె.శ్రీనివాసరావు, ఎసిపి డాక్టర్‌ రవికిరణ్‌ ఉత్తర్వుల మేరకు శనివారం రాత్రి జగ్గయ్యపేట ఇన్‌ఛార్జి ఎస్‌.పరమేశ్వర్‌ సమక్షంలో జగ్గయ్యపేట సర్కిల్‌ ఎస్‌ఐలు వారి సిబ్బంది సహాయంతో ధనంబోర్డ్‌లో కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించారు. అందులో భాగంగా 305 ఇళ్లను సోదా చేశారు. ఆ సోదాలో భాగంగా 120 బైక్స్‌, 3 ఆటోలు, తనిఖీ చేయగా 8 బైక్స్‌, 1 ఆటోను ఎటువంటి పత్రాలు లేని కారణంగా స్వాధీనం చేసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

➡️