పలుచోట్ల సుబ్బారెడ్డి వర్థంతి సభ

Jun 15,2024 22:10

విజయవాడ : ముఠా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు టి.సుబ్బారెడ్డి 5వ వర్ధంతి సభలు పలుచోట్ల నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు స్థానిక నోవాటెల్‌ హోటల్‌ పక్కన రామకృష్ణ మార్బుల్‌ సెంటర్లో సుబ్బారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. నాయకులు రావాడలక్ష్మణరావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎ.వి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సుబ్బారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ముఠా రంగాన్ని అభివృద్ధి చేశారని 50 సంవత్సరాలు సిఐటియు ముఠా రంగానికి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నగరానికి ఎనలేని అలుపెరగని సమరశీల పోరాటం కృషి చేశారన్నారు. ముఠారంగ, నాయకత్వం హమాలీలు, కార్మిక వర్గం ఆయన వదిలి వెళ్ళిన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నేటితరం ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపుఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు సిటీ నగర అధ్యక్ష కార్యదర్శులు రాజు, ఎన్‌.కోటబాబు, ముఠా నాయకులు సిహెచ్‌.ఈశ్వరరావు, మల్లేష్‌ తదితర ముఠా హమాలీ కార్మికులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్‌ సిటీ పరిధిలో ఏర్పాటు చేసిన సభలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింహారావు, సిహెచ్‌. బాబూరావు, ఎన్‌.సిహెచ్‌.శ్రీనివాస్‌ మాట్లాడుతూ నగరంలో ముఠా రిక్షా మున్సిపల్‌ వంటి అనేక తరగతుల కార్మికులను సమీకరించి సిఐటియును కార్మిక పోరాటాలను నిర్మించడానికి సుబ్బారెడ్డి విశేష కృషి చేశారని తెలిపారు. ఈ సభల్లో సిఐటియు సెంట్రల్‌ సిటీ అధ్యక్ష కార్యదర్శులు కె.దుర్గారావు, ఎం.వి.సుధాకర్‌, ఎం.సీతారాములు, టి.ప్రవీణ్‌ ముఠా కార్మిక సంఘం నేతలు ఎం.బ్రహ్మయ్య నరసింహులు వెంకట్రావు శ్రీరాములు రెడ్డి, నాలి శ్రీను పాల్గొన్నారు. గవర్నర్‌ పేటలోని, ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌, ఆలీ బేగ్‌ వీధి ప్రాంతాల్లో సిఐటియు అనుబంధ సంస్థ ముఠా వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వర్థంతి సభ నిర్వహించారు. సుబ్బారెడ్డి చిత్రపటానికి నేతలు, కార్మికులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మాట్లాడారు. సుబ్బారెడ్డి నాలుగున్నర దశాబ్దాలపైగా ముఠా కార్మికులను కూడగట్టి ఉద్యమాలు నడిపారన్నారు. వామపక్షాల కార్పొరేషన్‌లో సుబ్బారెడ్డి కార్పొరేటర్‌గా పనిచేసి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు. ఈ సభలలో ముఠా కార్మిక నేతలు బ్రహ్మయ్య, నరసింహులు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కార్మికుని కుటుంబానికి ఆర్థిక సాయంస్థానిక రాజీవ్‌గాంధీ హౌల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌లో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ముఠా కార్మికుడు మస్తాన్‌ కుటుంబానికి ముఠా కార్మికులు రూ.52,000 ఆర్థిక సాయం చేశారు. వీటిల్లో రూ. 47, 150 ముఠా కార్మికులు సాయం చేయగా, ముఠా కార్మిక సంఘం నేత సుబ్బారెడ్డి అల్లుడు, నేతాజీ పబ్లిక్‌స్కూల్‌ అధినేత తిరుపతిరెడ్డి మరో ఐదు వేలు ఆర్థిక సాయం చేశారు. భవానీపురం : భవానీపురం ఐరన్‌ యాడ్‌ కాంప్లెక్స్‌లో ముఠా వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో జరిగిన సభలో యూనియన్‌ ప్రధాన కార్యదర్శి ఎం. సీతారాములు, సిపిఎం కార్పొరేటర్‌ బోయి సత్యబాబు, యుటిఎఫ్‌ మాజీ నాయకులు తిరుపతి రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఠా కార్మికుల సమగ్ర సంక్షేమ చట్టం కోసం ముఠా కార్మికుల సాంప్రదాయ హక్కుల కోసం పని భద్రత కోసం నగరంలో అనేక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నగర నాయకులు రోశయ్య, ఏ. వెంకటేశ్వరరావు, శ్రీనివాస్‌ కె.వెంకటరమణ, రామారావు తదితరులు పాల్గొన్నారు. వన్‌టౌన్‌ శంకర్‌ కేఫ్‌ సెంటర్‌లో సిఐటియు పశ్చిమ సిటీ అధ్యక్షులు జి.వెంకట్రావు (చౌదరి) ఆధ్వర్యంలోసభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఠా కార్మిక నాయకులు రామారావు, ఏడుకొండలు, శ్రీను, రాజు, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️