పదో తరగతి ఫలితాల్లో పలువురు విద్యార్థుల విజయం

Apr 22,2024 22:51
  • నందిగామ జడ్పీ హెచ్‌ 68శాతం ఉత్తీర్ణత

ప్రజాశక్తి – నందిగామ : పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష ఫలితాల్లో నందిగామ జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు 68 శాతం ఫలితాలు సాధించారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి సోమవారం తెలిపారు. పాఠశాల విద్యార్థిని పి.నాగ ప్రతిభ 576/600 మార్కులు సాధించి స్కూల్‌ ఫస్ట్‌ నిలిచారు. 230 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 156 మంది విద్యార్థులు పాసయ్యారని, 74 మంది ఫెయిల్‌ అయ్యారని తెలిపారు.శ్రీ చైతన్య ప్రభంజనంపదో తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించిందని పాఠశాల ప్రిన్సిపాల్‌ గుత్త ప్రదీప్‌ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దాట్ల అక్షిత 589 మార్కులు, 585 దాటిన విద్యార్థులు ఐదుగురు, 580 దాటిన విద్యార్థులు 15 మంది, 550 మార్కులు దాటి 60 మంది పాసయ్యారని తెలిపారు. 500 మార్కులు దాటిన వారు 93 శ్రీ చైతన్య స్కూల్‌ విద్యార్థులు 139 మంది పదో తరగతి పరీక్షలు రాశారు. 139 మంది పాసయ్యారని తెలిపారు. విద్యార్థుల యావరేజ్‌ మార్క్స్‌ 515 అని తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో అద్భుతంగా ఫలితాలు రావడంతో స్కూల్‌ ప్రిన్సిపాల్‌, టీచర్స్‌ విద్యార్థులు స్వీట్లు పంచుకొని శ్రీ చైతన్య స్కూల్‌ ముందు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. మరోసారి శ్రీ చైతన్య విద్యార్థులకు ఎదురులేదని ఫలితాలు వచ్చాయని, ఏదైనా శ్రీ చైతన్య టాప్‌ అని ప్రిన్సిపల్‌ ప్రదీప్‌ తెలిపారు. నందిగామ సర్కిల్లో పదోతరగతి ఫలితాల్లో బెస్ట్‌ యావరేజ్‌ కూడా శ్రీ చైతన్య స్కూల్‌ అని ప్రిన్సిపల్‌ తెలిపారు.కాకతీయ అపోలో విద్యా సంస్థల ప్రతిభకాకతీయ అపోలో విద్యా సంస్థల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచి నందిగామ నియోజకవర్గ స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచారని కాకతీయ అపోలో విద్యా సంస్థల అధినేత కాపా రవీంద్రనాథ్‌, డైరెక్టర్‌ కాపా కార్తికేయ తెలిపారు. కామా స్వప్నిక 590, మరో 12 మంది విద్యార్థులు 580 మార్కులు సాధించారని తెలిపారు. 11 మంది విద్యార్థులు 570, 17 మంది విద్యార్థులు 560 మార్కులు సాధించారని, 17 మంది విద్యార్థులు 550 మార్కులు సాధించారని, 102 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారని తెలిపారు. 147 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 146 మంది విద్యార్థులు పాసయ్యారని తెలిపారు. 99.3 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.గురుకుల విద్యాలయం విజయభేరిప్రజాశక్తి – రెడ్డిగూడెం : రంగాపురం అంబేద్కర్‌ గురుకుల బాలికల పాఠశాలలో సగ్గుర్తి సిరి 586/600, చాట్ల వర్షిణి 569/600, పులపాక ప్రణ్వి 569/600, సగ్గుర్తి మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ తబిత తెలిపారు. రంగాపురం కస్తూరిబాయి గాంధీ బాలికల విధ్యాలయంలో గరికే చామంతి 530 /600, తానంకి ప్రసన్న కుమారి 516/600 మార్కులు సాధించారని ప్రిన్సిపాల్‌ యం.శ్యామల తెలిపారు. గీతాంజలి హైస్కూల్‌లో పరమ రాంబాబు 585/600, కొండపల్లి ప్రసన్న 584/600 మార్కులు సాధించారని కరస్పాండెంట్‌ కె కోటిరెడ్డి, ప్రిన్సిపాల్‌ మల్లికార్జున రెడ్డి తెలిపారు.వెల్లంకి జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థి సమీనా ప్రథమస్థానంప్రజాశక్తి – వీరులపాడు : జుజ్జూరు కేంద్రం పరిధిలోని వెల్లంకి జిల్లా పరిషత్‌ పాఠశాలలో షేక్‌ సమీనా ఆఫర్స్‌ ప్రథమ స్థానం సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. జయంతి జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన పి సరిత 564 మార్కులతో రెండో స్థానం సాధించిందన్నారు. ‘గీతాంజలి’కి ప్రథమ స్థానంప్రజాశక్తి – గంపలగూడెం: స్థానిక తోటమూల గల గీతాంజలి ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌లో పదో తరగతి ఫలితాల్లో 39 మందికి 39 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకటరెడ్డి తెలిపారు. జి.కావ్య 581/600 మార్కులు, జయంత్‌ రెడ్డి 575, జి.రుచిత రెడ్డి 573 25 మంది 500 పైగా మార్కులు వచ్చిన వారని తెలిపారు.వివేకానందలో 500కు పైగా మార్కులు: గొల్లపూడిలోని వివేకానంద విద్యాలయంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు కింది విధంగా వచ్చినట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్‌ బి.సీతారామిరెడ్డి తెలిపారు. పాఠశాల నుండి 34 మంది పరీక్షలకు హాజరు కాగా 31 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అందులో ఐదుగురు 500 మార్కుల కుపైగా సాధించారన్నారు. తోటమూ లలోని శ్రీ గాయత్రి విద్యాసంస్థలో దీపిక భారతి రెడ్డి 575 మార్కులు, పెద్దకామల్ల కళ్యాణి 575, వికృతి స్నేహలత 574 మార్కులు సాధిం చినట్లు కరెస్పాండెంట్‌ చిరుమామిళ్ల వేణుగోపాలరావు తెలిపారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 100 మంది రాయగ 76 మంది ఉత్తీర్ణులైనట్లు ఆ పాఠశాల ప్రధానోపా ధ్యాయులు బి.కిరణ్‌ కుమార్‌ తెలిపారు. పెద్దగమల హరిణి 580, వేల్పుల విజయలక్ష్మి 567, కోట హరిణి 547 మార్కులు సాధించినట్లు తెలిపారు. స్థానికంగా ఉన్న (కేజీబీవీ) కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో శ్రీకాకుళం మహేశ్వరి 541, గొల్లమందల ఉదయ 530 మార్కులు, ఇడుపులపాటి జ్యోతి 525 మార్కులతో మూడో స్థానాన్ని వశపరచుకుంది. పాఠశాలలో 40 మంది విద్యార్థులు ఉండగా, అందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రిన్సిపల్‌ మోక్షగుండం వెంకట లక్ష్మి తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల విజయంప్రజాశక్తి – రెడ్డిగూడెం : కూనపరాజుపర్వ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 75శాతం, రెడ్డిగూడెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 63శాతం, కుదప జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 75శాతం, మద్దులపర్వ మోడల్‌ స్కూల్‌ 98 శాతం, రంగాపురం గురుకుల పాఠశాలలో 99శాతం, కస్తూరిబా గాంధీ విద్యాలయంలో 98శాతం, నాగులూరు హైస్కూల్‌లో 79శాతం, రెడ్డిగూడెం గీతాంజలి హైస్కూల్‌లో 98శాతం, నారాయణ హైస్కూల్‌లో 100శాతం ఉత్తీర్ణత సాధించారని మండల విద్యాధికారి రమేష్‌ తెలిపారు.100 శాతం ఉత్తీర్ణతప్రజాశక్తి – జగ్గయ్యపేట : మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో 820 మంది విద్యార్థులకు గానూ 819 మంది విద్యార్థులు హాజరు కాగా 734 మంది (90శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొదటి స్థానం ఏపీఎస్‌ డబ్ల్యూఆర్‌ఎస్‌ (బాలికలు) పి.పూజ 581 మార్కులు, రెండవ స్థానం జడ్పీహెచ్‌ఎస్‌ (బాలికలు) సి.హెచ్‌. గాయత్రి 568 మార్కులు, మూడా స్థానం చిల్లకల్లు జిల్లా పరిషత్‌ పాఠశాల బి.రమ్యశ్రీ 564, పోచంపల్లి పాఠశాల 43 మంది విద్యార్ధులకు 43 మంది విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల విద్యాశాఖ అధికారి ఎల్‌.చిట్టిబాబు తెలిపారు. శ్రీ చైతన్య ప్రభంజనంపట్టణంలోని జగ్గయ్య పేట శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విజయ భేరి మోగించారు. పాఠశాలలోని విద్యార్థి పసుపులేటి శరణ్య 595 మార్కులతో టౌన్‌ఫస్టుగా నిలిచి రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు సాధించిందని పాఠశాల ప్రిన్సిపాల్‌ కొనకంచి లావణ్య తెలిపారు. ఈ సందర్భంగా శరణ్యను ప్రిన్సిపాల్‌ లావణ్య, ఉపాధ్యాయ బృందం అభినందించారు. పాఠశాలలోని ప్రథమ స్థానంలో 58 మంది విద్యార్థులు, ద్వితీయ శ్రేణిలో నలుగురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇజిఎం మురళీకృష్ణ, ఆర్‌ఐ టి.వినోద్‌, డీన్‌ వి.కృష్ణ, ప్రీ ప్రైమరీ ఇన్చార్జి లిల్లీ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.కొండపల్లి జెడ్‌ పి బాలికోన్నత పాఠశాల విజయం ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఇబ్రహీంపట్నం మండల స్థాయిలో ప్రథమ స్థానం 577/600 సాధించిన కొండపల్లిలోని జెడ్‌పి బాలికోన్నత పాఠశాల విద్యార్థినులు బండారు ఉషారాణి 577 మార్కులతో, ఎస్‌.కె షఫీనా 577 మార్కులతో 10 వ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన వీరు ఇబ్రహీంపట్నం మండలం ప్రథమ స్థానాలు సాధించినట్లు తెలిపారు. నందిగామ ఉప విద్యాశాఖాధికారి ఎ.వెంకటప్పయ్య పిల్లలకు ఆశీస్సులు అందించారు. మరో విద్యార్థినీ జి.అలేఖ్య 558 మార్కులతో ద్వితీయ స్థానంలో, వై.మౌనిక 540 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారని హెచ్‌ఎం బి.పద్మ లత తెలిపారు. వెంట్ర ప్రగడ జెడ్పి హెచ్‌ఎస్‌కు మండల ఫస్ట్‌ ర్యాంక్‌ ప్రజాశక్తి – పెదపారుపూడి : మండలంలోని 5 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు మొత్తం 207 మంది పరీక్షకు హాజరవ్వగా, 186 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని ఎంఇఒ బొడ్డు శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంట్రప్రగడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలలో మొదట ర్యాంక్‌ ఏ బిందు అమూల్య 576 మార్కులు, యలమర్రు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన టి.యశస్విని 560 మార్కులు సాధించినట్లు తెలిపారు.శ్రీ చైతన్యకు రికార్డు స్థాయి ఫలితాలు ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నగరంలోని శ్రీ చైతన్య విద్యార్థులు రికార్డు స్థాయి ఫలితాలు సాధించినట్లు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్‌ జనరల్‌ మేనేజర్‌ మద్ది నేని మురళీకృష్ణ తెలిపారు. ఎం.జీ.రోడ్డులోని శ్రీ చైతన్య కళాశాలలో సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ విద్యార్థి పి.కమలినీ రాజ్‌ 597 మార్కులతో ప్రథమ స్థానం సాధించినట్లు తెలిపారు. 595కు పైగా ఆరుగురు విద్యార్థులు, 590కి పైగా 66 మంది విద్యార్థులు , 585 మార్కులు పైగా 194 మంది, 580కి పైగా 399 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. 550కి పైగా 1407 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు. 500 మార్కులు పైన 2594 మంది విద్యార్థులు సాధించారని తెలిపారు.స్టేట్‌ సిలబస్‌తో పాటు టెక్నో ప్రోగ్రాం, ఐ – కాన్‌, ఐపిఎల్‌, ఎంపిఎల్‌ వంటి ప్రోగ్రామ్స్‌ ద్వారా మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ప్రతి ఏటా తమ విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. తల్లి దండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అందరి సహకారం వల్లనే మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు.జెపి పాఠశాల విజయంప్రజాశక్తి – వత్సవాయి : వత్సవాయి లోని ఎం జె పి పాఠశాలలో 578 మార్కులతో షేక్‌ ఇస్మాయిల్‌, వత్సవాయి జడ్పీహెచ్‌ స్కూల్‌ జి.రాజ్యలక్ష్మి 577 మార్కులతో, ఎం.కీర్తన భాయి 576 మార్కులతో మండల ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలను ఏకంగా కైవశం చేసుకున్నాయి. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఎల్‌ నాగరాజు మాట్లాడుతూ మండలంలో తొమ్మిది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరు పాఠశాలలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయన్నారు. శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనంప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి పరీక్ష ఫలితాలలో అద్దేపల్లి శ్రావ్య వాసవి, హాల్‌ టికెట్‌ నెంబర్‌, 2413126159, 593 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. టి.వైష్ణవి 585 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది, ఎన్‌.తిలక్‌ 585 మార్కులు సాధించి ద్వితీయస్థానంలో నిలిచారు. పి.సత్యసాయి 584 మార్కులు సాధించి తృతీయ స్థానం సాధించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సయ్యద్‌ ఐనూల్‌ మెడల్స్‌ సర్టిఫికెట్స్‌ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇజిఎం మురళీకష్ణ, ఆర్‌ఐ వినోద్‌ కుమార్‌, డీన్‌ సుధీర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.డిఎవి పాఠశాల విద్యార్థుల విజయ ప్రభంజనండి.ఎ.వి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణతతో పాటు గణిత శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో 100/100 మార్కులు తెలుగులో 99/100 మార్కులు సాధించి అత్యద్భుతమైన ప్రగతిని కనబరిచి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. 579 మార్కులు సాధించిన జి.వింధ్య పాఠశాల ఫస్ట్‌ ర్యాంకర్‌గా నిలిచింది. అంతేకాకుండా 500 మార్కులు కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న విద్యార్థులు 42 మంది ఉండటం గమనార్హం.బెజవాడ రాజారావు హైస్కూలు విజయభేరిప్రజాశక్తి – భవానీపురం : 2023 – 24 పదో తరగతి పరీక్షా ఫలితాలలో విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు హైస్కూల్‌ విజయభేరి మోగించింది. పాఠశాల నుండి 49 మంది విద్యార్థులు హాజరు కాగా 47 మంది ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణత సాధించినట్లు ఆ పాఠశాల కరెస్పాండెంట్‌ బెజవాడ రాజారావు తెలిపారు. జారాతబసుం 551 అత్యధిక మార్కులు సాధించగా, 549 మార్కులతో ధారావతు విఖిత్‌ సాయి కిరణ్‌ ద్వితీయ స్థానంలో, 544 మార్కులతో రంగాల హరిప్రియ తృతీయ స్థానంలో నిలిచారు. 500పైగా మార్కులు 12 మంది విద్యార్థులు, ఫస్ట్‌ క్లాస్‌ మార్కులు 40 మంది, సెకండ్‌ క్లాసులో 7 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బెజవాడ రాజారావు తెలిపారు. శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనంప్రజాశక్తి – వన్‌టౌన్‌ : తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య వన్‌టౌన్‌ బ్రాంచ్‌కి చెందిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రభంజనం సృష్టించారు. 100 శాతం ఉత్తీర్ణులతో పాఠశాలన్నిటికీ ఆదర్శంగా నిలిచింది. అత్యుత్తమ మార్కులు సాధించిన వన్‌టౌన్‌ బ్రాంచ్‌కి చెందిన పి.దర్శన 590 మార్కులు సాధించి శ్రీ చైతన్య ప్రథస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో డి.అమూల్య, 588 మార్కులు, టి.సిద్దిష్‌ 580 తృతీయ స్థానంలో నిలిచారు. మొదటి డివిజన్లో 73 మంది విద్యార్థులు, రెండో డివిజన్లో 15 మంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ కె.సునీత మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల శ్రీ చైతన్య కరిక్యులమ్‌ వల్లనే ఇంతటి ఘన విజయం సాధించారని ఆమె అన్నారు. విద్యార్థులకు ప్రిన్సిపల్‌ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇజిఎం మురళీకృష్ణ, ఆర్‌పి.రాజేష్‌, డీన్‌ నరేష్‌, ఇన్‌ఛార్జిలు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.శ్రీ గౌతమ్‌ విద్యార్థుల విజయకేతనంచిట్టినగర్‌లోని శ్రీ గౌతమ్‌ స్కూల్‌ విద్యార్థులు విజయ యందుభి మోగించారు. ఈ సందర్భంగా సోమవారం 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలైన సందర్భంగా విద్యా సంస్థల డైరెక్టరు ఎన్‌.సూర్యారావు స్కూల్‌ ఆవరణలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023-2024 విద్యా సంవత్సరంలో 99.5 ఉత్తీర్ణత శాతంతో తమ పాఠశాల ఉత్తీర్ణత శాతం సాధించినట్లు తెలిపారు. 600 మార్క్స్‌కు గానూ 584 మార్కులతో స్కూల్‌ టాపర్‌లుగా, తేజా కుమార్‌, దీపిక, నిఖిత, ప్రవల్లిక, హర్ష మంచి ఉత్తీర్ణత స్థానాలు సాధించినట్టు తెలిపారు. సబ్జ్బెక్టుల వారీగా తెలుగు – 100 మార్కులు, ఇంగ్లీషు – 100, గణితం-100, సైన్స్‌-99, సోషల్‌ – 100, హిందీ – 94 మార్కులతో పాటు, 500 మార్కులతో 89 మంది, ప్రథమ శ్రేణిలో 158, ద్వితీయ శ్రేణిలో 30, తృతీయ శ్రేణి లో10 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. పదవ తరగతి ఫలితాలలో భాష్యం ప్రతిభప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో భాస్యం స్కూల్‌ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారని భాష్యం విద్యా సంస్థల కృష్ణా జిల్లా జోనల్‌ ఇన్‌ఛార్జి ఎన్‌.జోషి, ఆర్‌.అరుణ తెలిపారు. నగరంలోని భాష్యం జోనల్‌ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి 500 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 594 అత్యధిక మార్కులు తమ విద్యార్థి సాధించినట్లు తెలిపారు. 252 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించినట్లు తెలిపారు.

➡️