అభ్యర్థుల అలుపెరుగని ప్రచారాలు

May 3,2024 21:55
  • వాంబే కాలనీలో చిగురుపాటి బాబురావు సతీమణి ప్రచారం

ప్రజాశక్తి – అజిత్‌ సింగ్‌నగర్‌ : ఇండియా కూటమి బలపరిచిన సిపిఎం ఎమ్మెల్యే అభ్యర్థి చిగురుపాటి బాబూరావు సతీమణి చిగురుపాటి సునంద సెంట్రల్‌ నియోజకవర్గం 60వ డివిజన్‌ వాంబేకాలనీలో శుక్రవారం పర్యటించారు. కాలనీలో ఇంటింటికి తిరిగి స్థానికులకు సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబూరావు ప్రజల కోసం పోరాడే వ్యక్తిని పిలిస్తే పలికే వ్యక్తిని విజయవాడ అభివృద్ధి కోసం పోరాడే వ్యక్తిని నిత్యం ప్రజల్లో ఉండే పోరాడే యోధుడని విజయవాడ అభివృద్ధి కోసం నిత్యం పోరాడే నాయకుడని వాంబే కాలనీలో చేసిన పోరాటాల గురించి వివరించారు అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్నా అన్ని వర్గాల ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు అందించాలన్న ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులకు ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ ఇంచార్జ్‌ రత్నకుమారి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.62వ డివిజన్లో నేతల ప్రచారంసార్వత్రిక ఎన్నికల్లో సుత్తి కొడవలి నక్షత్రంపై ఓట్లు వేసి సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని 62వ డివిజన్‌ ప్రకాష్‌ నగర్‌ డివిజన్‌ ఇన్‌ఛార్జ్‌ ఎన్‌.నాగేశ్వరరావు అన్నారు. 62వ డివిజన్‌ ప్రకాష్‌ నగర్‌ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు అందజేశారు. పార్టీ సభ్యులు బి.రాము, జమలయ్య, పున్నయ్య, కామేశ్వరి ఆటో యూనియన్‌ నాయకులు చిన్ని తదితరులు పాల్గొన్నారుబాబూరావు గెలుపునకు ప్రచారంప్రజాశక్తి – విసన్నపేట : విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి కామ్రేడ్‌ చిగురుపాటి బాబురావు గెలుపును ఆకాంక్షిస్తూ శుక్రవారం నాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం నిర్వహిస్తున్న సిపిఎం విస్సన్నపేట మండల కార్యదర్శి విస్సంపల్లి నాగరాజు. ఈ సందర్భంగా ఆయన కమ్యూనిస్టు పార్టీ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీలను ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాం ఆయన అన్నారు.52వ డివిజన్‌లో వైసిపి అభ్యర్థి ఆసీఫ్‌ ప్రచారంప్రజాశక్తి – వన్‌టౌన్‌ : పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల్లో ప్రచారం భాగంగా శుక్రవారం 52వ డివిజన్‌. మల్లికార్జునపేట ఇన్‌ఛార్జ్‌ తంగిళ్ళ పూర్ణచంద్రరావు (రాము) ఆధ్వర్యంలో కొండ ప్రాంతాల్లో నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్‌ ఆసిఫ్‌ ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్‌ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలను అందుతున్నాయా లేక ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ వాలంటరీ వ్యవస్థ మీద ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రను దుమ్మెత్తిపోస్తున్నారు. వైసిపి అభ్యర్థి నల్లగట్ల ప్రచారంప్రజాశక్తి.- తిరువూరు : వైసిపి తిరువూరు నియోజకవర్గ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్‌ శుక్రవారం తిరువూరు పట్టణంలోని 10,11 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు కౌన్సిలర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి జగన్‌ ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ తాను గెలిస్తే తిరువూరు అభివద్ధికి కృషి చేస్తానని స్వామిదాస్‌ హామీ ఇచ్చారు. ఇండియా వేదిక అభ్యర్థి ప్రచారంప్రజాశక్తి – వత్సవాయి : జరగబోయే ఎన్నికల్లో బిజెపి బలపరిచిన టిడిపి అభ్యర్థిని, వైసిపి అభ్యర్థిని ఓడించి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని ఇండియా వేదిక ఎమ్మెల్యే అభ్యర్థి కర్నాటి అప్పారావు, సిపిఎం సీనియర్‌ నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు అన్నారు. శుక్రవారం మండలంలోని వత్సవాయి, వేముల నర్వ, కాకరవాయి, మాచినేని పాలెం, తాళ్లూరు, నందిగామ మండలంలో గొల్లమూడి, రుద్రవరం, సోమవారం, తొర్రగుంట పాడు, మాగల్లు తదితర గ్రామాల్లో ప్రచార యాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రూ.2 లక్షలు రైతు రుణమాఫీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం పది సంవత్సరాలు జరుగుతుందని తెలిపారు. ప్రతి పేద విద్యార్థి చదువుకోటానికి ఒకటో తరగతి పోస్ట్‌ గ్రాడ్యుటీ వరకు ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ఒక మహిళకు నెలకు రూ.8333 లు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మరలా దేశ ఆర్థిక అభివద్ధి చెందుతుందని ప్రాజెక్టులు పూర్తవుతాయని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కార అవుతుందని పేర్కొన్నారు. సిపిఎం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్‌, సిపిఎం నాయకులు తమ్మినేని రాంబాబు, పెంటి కోటేశ్వరరావు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచి ప్రోలు మండల అధ్యక్షులు ఎర్ర కుమారస్వామి, కొమ్మినేని నాగేశ్వరరావు, నల్లజాల ధనంజయలు, బ్లాక్‌ వన్‌ అధ్యక్షులు సనే రామారావు, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షులు అన్ని పాక వెంకటేశ్వర్లు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ప్రభాకర్‌ రావు పాల్గొన్నారు.కూటమి అభ్యర్థి తాయ్య ప్రచారంజగ్గయ్యపేట : ప్రచారంలో భాగంగా మండలంలోని బండిపాలెం, గుండబోయినపాలెం, పోచంపల్లి గ్రామలలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్‌ జిల్లా టిడిపి అధ్యక్షులు నెట్టెం శ్రీ రఘురామ్‌, విజయవాడ పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్‌ చిన్ని, జగ్గయ్యపేట నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీరామ్‌ సతీమణ శ్రీరాం శ్రీదేవి ప్రచారం వందశాతం హామీలు అమలు చేస్తా రాష్ట్రంలో దిశల వారిగా మద్యం నిషేధించి, ఓట్లు అడుగుతానని మాట ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి మాట తప్పాడనీ, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, మద్యం నిషేధం సంగతి గలికొదిలేశడనీ కూటమి అభ్యర్థి శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య సతీమణి శ్రీరాం శ్రీదేవి అమ్మాజీ అన్నారు. పట్టణంలోని 31వ వార్డు టీచర్స్‌ కాలనీ, విష్ణుప్రియ నగర్‌లో శ్రీరాం శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగనన్న పాలనలో ఇంటి వద్దకే పాలనమళ్లీ వైసిపిని గెలిపించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను కుమార్తె పద్మ ప్రియాంక అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అందించిన సంక్షే మాన్ని వివరిస్తూ ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామి నేని ఉదయభాను నియోజకవర్గంలో చేసిన అభి వృద్ధిని తెలియపరుస్తూ ఉదయభాను సోదరీమణి బేబీ, కుమార్తె పద్మ ప్రియాంక, కోడలు కావ్య ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించారు.రైతుకు అండగా నిలిచింది జగనే విత్తు నుంచి విక్రయం దాకా అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచి వ్యవసాయాన్ని పండుగ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మాత్రమేనని విమలభాను ఫౌండేషన్‌ చైర్మన్‌ సామినేని విమలభాను అన్నారు. పట్టణంలోని స్థానిక రైతు బజార్‌ నందు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయ భాను చేసిన అభివృద్ధిని తెలియపరుస్తూ ఉదయభాను సతీమణి సామినేని విమలభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.బాబు అధికారంలోకి వస్తే కరువేజగ్గయ్యపేట: చంద్రబాబు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరువు తప్పదని ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను అన్నారు. మండలంలోని తక్కెళ్ళపాడు, అనుమంచిపల్లి గ్రామాలలో ప్రభుత్వవిప్‌, శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఉదయభాను మాట్లాడుతూ 2014లో చంద్రబాబు మోసాలను తెలుసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో జగన్మోహన్‌ రెడ్డిని గెలిపించారని తెలిపారు. మండలంలోని గండ్రాయి గ్రామంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వ విప్‌, స్థానిక శాసనసభ్యులు సామినేని ఉదయభాను ఎన్నికల ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్రాయి గ్రామస్తులు ఉదయభానుకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సామినేని ఉదయభాను మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మరల ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రావాలని కోరారు.ఇండియా వేదిక అభ్యర్థి బొర్రా కిరణ్‌ ప్రచారంప్రజాశక్తి – రెడ్డిగూడెం : ఎన్టీఆర్‌ జిల్లా, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇండియా వేదిక అభ్యర్థిగా కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బొర్రా కిరణ్‌ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పివి.ఆంజనేయులుతో కలిసి తన ఎన్నికల ప్రచారాన్ని రెండో విడత రెడ్డిగూడెం మండలంలో ప్రారంభించారు. శుక్రవారం ఓబులాపురం, నరుకుళ్ళపాడు, రుద్రవరం, కుదప, కూనపరాజుపర్వ, శ్రీరాంపురం, ముచ్చినపల్లి గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఇండియా వేదిక ప్రభుత్వం రావాలని అన్నారు. ప్రత్యేక హోదా, రాజధాని, విశాఖ ఉక్కు, యువతకు ఉపాధి, ఉద్యోగాలు రావాలంటే ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అలాగే ఇంటింటికీ తిరిగి హస్తం గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండియా వేదిక అభ్యర్థి గెలుపు కోసం ఎర్రజెండా – మూడు రంగుల జెండా చూపరులను ఆకట్టుకుంటూ ఆలోచింపజేసేలా ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి, కృష్ణారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గొడవర్తి వెంకటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.వైసిపి అభ్యర్థి సర్నాల ప్రచారంఅన్నేరావుపేట, సీతారాంపురం, శ్రీరాంపురం, ముచ్చినపల్లి గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైలవరం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.సౌమ్య ప్రచారంప్రజాశక్తి – వీరులపాడు : మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. నరసింహారావు పాలెం పొన్నవరం బోడవాడ జమ్మవరం గోకరాజు పల్లి ఎల్లంకి గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా విస్తతంగా గ్రామాల్లో పర్యటించి జనసేన, బిజెపి, టిడిపి అభ్యర్థి తంగిరాల సౌమ్యను గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రజాశక్తి – వీరులపాడు : రంగాపురం, తిమ్మాపురం గ్రామాల్లో ప్రతి ఇంటికి తిరుగుతూ డాక్టర్‌ మొండితోక జగన్‌ మోహన్‌రావు ప్రచారం నిర్వహించారు.అభివధ్ధి చూసి ఓటేయండి : మొండితోకప్రజాశక్తి – కంచికచర్ల : గడచిన 5 ఏళ్ల లో మంచి చేశానని అనిపిస్తేనే ఓటు వేయండని వైసిపి అభ్యర్ధి , సిట్టింగ్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి మండలంలోని కొత్తపేట గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌ షో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .గత పాలకులు అభివధ్ధిని పక్కన బెట్టి సామంతరాజుల కనుసన్నల్లో ప్రజాధనాన్ని లూఠీ చేశారన్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నో ఏళ్లగా పరిష్కారం కాని సమస్యలను కూడా పరిష్కారించామన్నారు.

➡️