అపార్ట్మెంట్ వాసుల సమస్యలను పరిష్కరిస్తాం

Mar 30,2024 16:44 #ntr district

62, 63 డివిజన్ లో మార్పు కోసం పాదయాత్రలో సిపిఎం 

పాదయాత్రలో సమస్యలు తెలియజేస్తున్న మహిళలు
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : విజయవాడ సెంట్రల్ సిటీ 62, 63 డివిజన్లో మార్పు కోసం సిపిఎం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొని ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేస్తూ పాదయాత్ర నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి-మోడీ ప్రభుత్వంను ఓడించాలని, మోడీకి మద్దతు తెలుపుతున్న టిడిపి, జనసేన పార్టీలను, అదేవిధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని వైసీపీని ఓడించాలని కోరారు. అపార్ట్మెంట్లలో సమస్యలను పరిష్కరించడం కోసం పోరాడుతున్న సిపిఎంను గెలిపించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలు విపరీతంగా పెంచారని, కరెంట్ చార్జీలు అధికంగా పెంచారని, చెత్త పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. నిత్యవసర వస్తువులు, పప్పు ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. మన వేసే ఓటు ద్వారా విజయవాడను మారుద్దాం ప్రజలందరికీ అండగా ఉంటామని తెలిపారు. నగరంలో ఉన్న సమస్యలను పట్టించుకునే నాయకులు లేరని, జి ప్లస్ త్రీ అపార్ట్మెంట్లలో నీటి సమస్య, డ్రైనేజ్ సమస్య, ఏ సమస్య కోసమైనా పోరాడి ఆ సమస్య తీరేవరకు ప్రజలకు అండగా ఉండేది సిపిఎం నాయకులేనని  అన్నారు. సిపిఎంకి రోజు రోజుకి ప్రజల అండ పెరుగుతుందని తెలిపారు. నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంకు ఓటు వేయాలని కోరారు. సింగ్ నగర్ ఏరియాలో అనేక అపార్ట్మెంట్లో పట్టాలు లేకపోవడం దారుణం అన్నారు. ఖాళీగా ఉన్న ప్లాట్లను ప్రజలకు పంపిణీ చేయలేదని తెలిపారు. నగరంలో ట్రాఫిక్ ను అధికమించాలంటే రెండవ బ్రిడ్జి అవసరమని పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రజలు అనేక సమస్యలను సిపిఎం నాయకులు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి బి రమణ రావు అధ్యక్షులు కే దుర్గారావు డివైఎఫ్ఐ నాయకులు నాగేశ్వరరావు సిపిఎం నాయకులు చింతల శ్రీనివాస్ రాంబాబు ఎస్ కే పేరు ఝాన్సీ సాంబిరెడ్డి బాబురావు రాంబాబు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️