ఆకులకు సత్కారం

Apr 29,2024 22:11

ప్రజాశక్తి – భవానీపురం : వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియ మితులైన ఆకుల శ్రీనివాస కుమార్‌ను రాష్ట్ర కాపు నాడు నాయకులు, వైసీపీ నగర ప్రధాన కార్యదర్శి వడ్లాని మాధవరావు ఘనంగా సత్కరించారు. సోమవారం మాధవరావు కార్యాలయంలో ఆకులను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు కాపు ప్రముఖులు పాల్గొని ఆకుల శ్రీనివాస్‌కు అభినందనలు తెలియచేశారు. ఈ సందర్బంగా ఆకుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సీఎం జగనన్న అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తున్నారని కొనియాడారు. మళ్లీ జగన్‌ను సీఎంగా చేసుకోవాలని రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరావు మాట్లాడుతూ పదవికి వన్నెతెచ్చే నాయకుడైన ఆకుల శ్రీనివాస్‌ వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులవడం అభినందనీయమని అన్నారు.

➡️