మహిళలే నిర్ణేతలు

May 17,2024 21:26

 మండలంలో ఖమ్మం పాడు, వత్సవాయి, భీమవరం, మంగోల్లు, చిట్యాల, గ్రామాల్లో ఈనెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహిళల ఓట్ల శాతం ఎక్కువగా నమోదయ్యాయి. వత్సవాయి మండలంలో 90 శాతం పైగా ఓటర్లు ఓట్లు వేశారు. పోలింగ్‌ నమోదయ్య. వత్సవాయి మండలంలో 50 వేల 17 ఓట్లు ఉండగా వాటిలో పురుషులు 24,060, మహిళలు 25,957 మంది ఉన్నారు. మొత్తం ఓట్లు 45,105 ఓట్లు నమోదు కాగా వాటిలో పురుషులు 21586, 23,519 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పురుషులకంటే స్త్రీలు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటలైనా ఓటర్లు ఓటు హక్కు వినియోగించు కోవడం కోసం వరుస క్రమంలో నిలబడిపోయారు. ఓటు హక్కును వినియోగించు కున్నారు. డబ్బాకపల్లి, వత్సవాయి, కన్నివేడు, మంగళ్ళు తదితరు గ్రామాల్లో రాత్రి 10 గంటలైనా ఓటును మాత్రం సద్వినియోగం చేసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ శాతం 2024 సంవత్సరంలో ఎక్కువ శాతం రావటంతో నాయకుల్లో ఎవరు గెలుస్తారని సందేహపడుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక మరి కొందరు మధ్యాహ్నం టైంలో ఇంటికి వెళ్లి సాయంత్రం నాలుగు గంటలకు వచ్చి ఓటమి వినియోగించుకున్నారు. అయినా బారులు తీరి ఉండటంతో వరుస క్రమంలో నిలబడి ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ స్థాయిలో రెండు లక్షల 10,000 మంది ఓటర్లు ఉండగా 90 శాతం పైగా ఓటును వినియోగించుకోవడంతో ఓటర్లు ఎటువైపు ఓటు వేశారా అని ఉత్కంఠగా సాగుతోంది. దీంతో జూన్‌ 4 వరకు వేచి చూద్దాం అంటూ సరిపెట్టుకుంటున్నారు.

➡️