యువ చిత్రకారిణి మేడా సింధూశ్రీ బెస్ట్‌ అవార్డు

May 26,2024 21:14

నగరానికి చెందిన ప్రముఖ యువ చిత్రకారిణి మేడా సింధూశ్రీకి చిత్రలేఖనం, క్రియేటివ్‌ క్రాఫ్ట్స్‌ విభాగంలో బెస్ట్‌ నంది అవార్డు, టాలెంట్‌ అవార్డు కైవసం చేసుకుంది. రితిక ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అవార్డు ఫంక్షన్‌లో ఆమె ఈ అవార్డులు అందుకుంది. హోప్‌ విన్‌ హాస్పిటల్‌ డాక్టర్‌ షమా సుల్తానా, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ నుంచి డాక్టర్‌ కొమరగిరి రాఘవరావు, లిటిల్‌ బ్లాక్‌స్టార్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ కో ఫౌండర్‌ తిరుమలశెట్టి మేఘన, రితిక ఫౌండేషన్‌ చైర్మన్‌ పి.నిత్యాచారి ఆమెకు ఈ అవార్డులను బహూకరించారు.

➡️