చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

సీతమ్మధార : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్‌సి ప్రకటనపై మొదటి సంతకం చేసి ఇచ్చిన మాటను సిఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారనిఎపి నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మర్రివేముల శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పౌరగ్రంథాలయం వద్ద చంద్రబాబు చిత్రపటానికి గాజుగ్లాస్‌తో పాలభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. వారాహియాత్రలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ చెప్పినట్లే హామీల అమలుకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కాగా వైసిపి ప్రభుత్వం 2019లో మెగాడిఎస్‌సి హామీనిచ్చి, నిరుద్యోగులకు నయవంచనకు గురిచేసిన జగన్‌కు ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో గుణపాఠం చెప్పారన్నారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రదీప్‌, జనసేన మహిళా విభాగం నేత కొల్లూరి రూప, నిరుద్యోగ పోరాట కమిటీ నాయకులు సేనాపతి సన్యాసినాయుడు, సత్యనారాయణ, వియ్యపు ఎర్రాజీ, మణికంఠ యువత పాల్గొన్నారు.

పాలాభిషేకం చేస్తున్న నిరుద్యోగులు

➡️