పాలకొల్లు మానవతా నూతన కార్యవర్గం…

May 26,2024 15:18 #Palakollu

పాలకొల్లు :మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పాలకొల్లు మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నెలవారీ కార్యక్రమంలో భాగంగా స్థానిక రోటరీ భవనంలో జరిగిన సమావేశంలో నూతన అధ్యక్షుడిగా ఉల్లంపర్రు మాంటిసోరి స్కూల్‌ అధినేత మద్దాల వాసు, కార్యదర్శిగా విజయ ల్యాబ్స్‌ అధినేత కొమ్ముల మురళి, కోశాధికారిగా ముత్యాల శ్రీవాత్సవ ప్రదీప్‌ ఎన్నికయ్యారు. వీరి పదవీకాలం ఈ ఏడాది జూలై ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది జూన్‌ 30వ తేదీ వరకు ఉంటుంది. మానవత మండల శాఖ అధ్యక్షుడు ముత్యాల శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ప్రతిష్టాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న మానవతా సేవా కార్యక్రమాలలో పాలకొల్లు శాఖను మరింత ఉన్నత స్థితికి తీసుకురావాలని శ్రీనివాస్‌ ఆకాంక్షించారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం వచ్చేనెల 23వ తేదీన ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కన్వీనర్‌ ముత్యాల రామారావు, సహాయ కార్యదర్శి గోపి, సభ్యులు బక్కా గంగాధర్‌, చిలుకూరి భీమన్న, పీర్‌ సాహెబ్‌, సొమంచి శాస్త్రి, యం అర్కే రాజు, వారధి వెంకట రమణ, అత్యం ఆదిశేషారావు, బోల్ల శ్రీనివాస్‌, పనింద్రుడు, తమ్మినీడి మురళీ, బోళ్ళ వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️