ప్రశాంతంగా జమ్మలమడుగు

ప్రజాశక్తి-జమ్మలమడుగు రూరల్‌ ప్రస్తుతం ప్రశాంతంగా జమ్మలమడుగు ఉంది. ఎన్నికల పోలింగ్‌ రోజు మినహా ఆతరువాత రోజు నుంచి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ప్రశాంత వాతావరణంలో జమ్మలమడుగును ఉంచేందుకు డిఎస్‌పి యస్వంత్‌ చర్యలు తీసుకున్నారు. దేవగుడి పల్లెల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. కూటమి ఎంపీ అభ్యర్ది భూపేష్‌ సుబ్బరామిరెడ్డి కూడా ప్రశాంతంగా ఉండి సంయమనం పాటించాలని కార్యకర్తలను, నాయకులను, దేవగుడి అభిమానులకు పిలుపునిచ్చారు. ఆ మేరకు సోషల్‌ మీడియాలో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదని కూడా ఒక ప్రకటనలో తెలిపారు. భూపేష్‌రెడ్డి దేవగుడి నుంచి బయటి ప్రాంతాలకు కుటుంబంతో సహా వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా నిడిజువ్వి నుంచి కొద్దీ రోజులు బయటికి పోయాడని సమాచారం. ఎన్నికలు అయిపోయాక జిల్లాలో జమ్మలమడుగులో ఘర్షన జరుగుతాయని సమాచారం రావడం అందుకు మళ్ళీ బందోబస్తు జిల్లాలోని 500 మందిని దించడంతో జమ్మలమడుగు మొత్తం పోలీసులతో ఉంది. వజ్ర వాహనం, పార్టీల వద్ద పికిటింగ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో డిఎస్‌పి యస్వంత్‌ గురువారం రాత్రి సామాజిక మాధ్యమాల ద్వారా జమ్మలమడుగు పట్టణంలో జరిగిన సంఘటనలపై సోషల్‌ మీడియాలో రేకెత్తించే పోస్టులు పెట్టిన ఇరుపార్టీలకు చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. సోషల్‌ మీడియా గ్రూపులలో ఇతర పార్టీల వారిని కించ పరిచే విధంగా పోస్టులు పెట్టిన లేదా తప్పుడు సమాచారం ప్రజలకు చేరవేసిన పోలీస్‌ శాఖ కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రూప్‌ అడ్మిన్‌లను కూడా బాధ్యులుగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

➡️