హైమాక్స్ లైట్ల వెలుగులో పెన్నహోబిలం

Apr 4,2024 17:47

మరో 3 ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపిన ఆలయ ఈఓ.విజయ్ కుమార్

ప్రజాశక్తి – ఉరవకొండ: ఉరవకొండ నియోజకవర్గంలో ప్రసిద్ధి చెందిన ఉరవకొండ మండల పరిధిలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం హైమాక్స్ లైట్లతో వెలిగిపోతోంది.అనంతపురం కెనరా బ్యాంక్ సహకారంతో రూ.1.71 లక్షలతో దీన్ని ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటు తో రాత్రి వేళల్లో ఆలయ తూర్పు,ఉత్తర ముఖ ద్వారాల వైపు వెలుగు సంతరించుకుంది.హైమాక్స్ లైట్లు ఏర్పాటు పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ మాట్లాడుతూ ఆలయంలో చుట్టూ మరో మూడు చోట్ల హైమాక్స్ లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.వీటి ఏర్పాటు వల్ల రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని చెప్పారు.హైమాక్స్ లైట్లు ఏర్పాటుకు సహకరించిన కెనరా బ్యాంక్ మేనేజర్ వెంకటరెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు.

➡️