మండుతున్న ఎండలు..అల్లాడుతున్న జనం

Apr 29,2024 21:39

ప్రజాశక్తి-బొబ్బిలి : ఎండలు మండిపోతుండటంతో జనం అల్లాడిపోతున్నారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరగడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఎండల తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం 12 గంటలు దాటితే పట్టణ, గ్రామీణ ప్రాంతాల రోడ్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 8గంటల నుంచే భానుడు విశ్వరూపం చూపడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. బొబ్బిలి ఏ 43 డిగ్రీలు ఉష్ణోగ్రత బొబ్బిలిలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రత 43 డిగ్రీలు నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వృద్ధులు, చిన్నారులు వేడి తాపాన్ని తట్టుకోలేపోతున్నారు. ఎండలకు భయపడి బయటకు రావడం లేదు. అత్యవసర పనులు ఉంటే ఉదయం 9 గంటల్లోపు చూసుకుని ఇంటికి వెళ్లిపోతున్నారు.శీతల పానీయాలకు పెరుగుతున్న గిరాకీ భానుడు భగభగ మండటంతో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు. పట్టణంలో నిరుద్యోగులు రోడ్లు పక్కన లస్సీ, ఫ్రూట్‌ జ్యూస్‌, షర్బత్‌, కర్బుజా పండ్ల షాపులను పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. శీతల పానీయాల షాపులు ఎక్కడికక్కడే దర్శనమిస్తున్నాయి.

➡️