అతిసార నుంచి పిల్లలను రక్షించుకోండి

Jul 1,2024 21:37

ప్రజాశక్తి-కొత్తవలస : అతిసార ప్రబలకుండా పిల్లలను రక్షించుకోవాలని ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ కోరారు. వియ్యంపేట సచివాలయంలో వైద్యాధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అతిసార నివారణ కార్యక్రమాన్ని సోమవారం ఎంపిపి నీలంశెట్టి గోపమ్మ, వియ్యంపేట సర్పంచ్‌ పులిబంటి రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ పిల్లలకు రోజులో మూడు లేదా అంత కంటే ఎక్కువ విరోచనాలు అయితే వెంటనే ఎఎన్‌ఎం, ఆశావర్కర్‌కి తెలియజేయాలన్నారు. చేతులు, పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. కార్యక్రమంలో పిహెచ్‌ఎన్‌ జగదాంబ, ఇఒ నరసింహారావు, హెచ్‌వి పద్మావతి, హెచ్‌ఎస్‌ ఈశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ చంద్రకళ, హెల్త్‌ అసిస్టెంట్‌ సత్యారావు, ఎఎన్‌ఎం భవాని, ఆశావర్కర్‌ వరలక్ష్మి పాల్గొన్నారు.వేపాడ : వేపాడ పిహెచ్‌సి వద్ద స్టాప్‌ డయేరియా వాల్‌పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎ.ధరణి మాట్లాడుతూ ఈ నెల ఒకటో తేది నుంచి ఆగస్టు నెలాఖరు వరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి సేనాపతి అప్పారావు, ఎంపిడిఒ నిశ్చల, ఎంఇఒ పి.బాల భాస్కరరావు, ఇఒపిఆర్‌డి ఉమ పాల్గొన్నారు.

➡️