పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రం

Apr 16,2024 23:58

కేంద్రాన్ని ప్రారంభిస్తున్న డాక్టర్‌ షకీలా శ్రీధర్‌రెడ్డి
ప్రజాశక్తి-సత్తెనపల్లి :
మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ కేంద్రాల ఏర్పాటు అభినందనీయమని వంశీ స్పెషాలిటీ హాస్పటల్‌ వైద్యులు డాక్టర్‌ షకీలా శ్రీధర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పాత బస్టాండ్‌ సెంటర్లో పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం (పిఎస్‌వికె) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ఆమె మంగళవారం ప్రారంభించడంతోపాటు మజ్జిగ చలివేంద్రానికి 10 రోజులకు అవసరమైన రూ.30 వేలను వితరణగా ఇచ్చారు. ఈ సందర్భంగా పిఎస్‌వికె కన్వీనర్‌ పొట్టి సూర్యప్రకాష్‌రావు మాట్లాడుతూ పిఎస్‌వికె ఆధ్వర్యంలో సందర్భానుసారంగా, ప్రజల అవసరాలను బట్టి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో కరోనా ఐసోలేషన్‌ సెంటర్‌, ఉచిత న్యాయ సేవకేంద్రం, వైద్యశిబిరాలను దాతల సహకారంతో నిర్వహించినట్లు వివరించారు. అందులో భాగంగానే ప్రతి వేసవిలో మాదిరి ఈ ఏడాదీ మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ మజ్జిగ కేంద్రం నిర్వాహణకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పిఎస్‌వికె నిర్వాహకులు టి.వెంకటేశ్వర్లు, కె.జగన్‌, కె.మాధవి, ఎ.వెంకటనారాయణ, గద్దె చలమయ్య, ప్రజా సంఘాల నాయకులు గుంటూరు విజరు కుమార్‌, ఎవిఎన్‌ గోపాలరావు, కె.శివదుర్గారావు, ఐ.లింగయ్య, పి.వీరేశం, డి.విమల, జి.ఉమశ్రీ, టి.రాము, జి.రజిని, పి.మహేష్‌, పి.మహేశ్వరి, జి.మల్లేశ్వరి, సుధారాణి, కె.రమాదేవి, పి.శేషు, ఎం.జ్యోతి, ఐ.అరుణ పాల్గొన్నారు.

➡️