తగ్గిన మామిడి దిగుబడి

ప్రజాశక్తి – పుల్లంపేట మండల పరిధిలో వందల సంఖ్యలో మామిడి తోటలు ఉన్నాయి. రైతులు ఉత్సాహంగా మామిడి సాగు చేశారు. ఈ ఏడాది మామిడి తోటలో పూత దశ నుంచే ి అనేక చీడపీడలు ఏర్ప డడంతో కాపు తగ్గిపోయింది. ఈ ఏడాది మామిడ ికాయల దిగుబడి తక్కువగా ఉండటంతో ధరలు అధికమయ్యాయి. ప్రస్తుతం ధరలు చూసిన ప్రజలు పెద్దగా మామిడి జోలికి వెళ్ళటం లేదు. మండల పరిధిలోని అనంతసముద్రం, వత్తలూరు, బావికాడ పల్లె, టి.కమ్మపల్లి, కొమ్మన వారిపల్లి తదితర గ్రామాల్లో దాదాపు 1000 ఎకరాల్లో పైగా రైతులు మామిడి సాగు చేశారు. ఏడాది అనూహ్యంగా ఎండలు పెరిగాయి. దీనికి తోడు వర్షభావ పరిస్థితులతో మామిడి తోటల్లో దిగుబడి తగ్గిందని రైతులు చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే ఏడాది మామిడికాయల దిగుబడి తక్కువగానే ఉంది. మామిడికాయల మండి కూడా మండల కేంద్రమైన పుల్లంపేట నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మామిడి తోటలున్న రైతులు నుంచి మామిడికాయలను దళారులు దిగుమతి చేసుకొని రైల్వే కోడూర్‌ మార్కెట్‌ మండికి తరలించేవారు. ఈ ఏడాది దిగుబడి తగ్గడం, ధరలు అధికం కావడంతో మార్కెట్‌ కూడా పడిపోయింది. మామిడి తోటలో పూత రాలిపోయి దిగుబడి శాతం తగ్గిందని రైతులు పేర్కొన్నారు. మార్కెట్లో పెరిగిన మామిడి ధర పంట తగ్గడంతో మార్కెట్లో ధరలు పెంచేశారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో మామి డికాయ ప్రియులు వేసవిలో ఎక్కువగా తినగలిగే మామిడి కాయల ధరలను చూసి కొనుగోలు చేసే పరిస్థితి లేకుండా పోయిందని పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. పండిన కాయలకు రుచి తగ్గాయి వర్షాభావ పరిస్థితుల కారణంగా చెట్లకు అవసరమైన పోషకాలు అందకపోవడంతో వచ్చిన కొద్దిపాటి దిగుబడి కూడా రుచికరంగా లేదని ప్రజలు చెబు తున్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కుర వడం, తోడు చీడ పీడలు అధికం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్య గోచారంగా మారింది. దీంతో కొద్దిపాటి కాయలు కూడా రుచికరంగా లేవని రైతులు చెబుతున్నారు. మార్కెట్లో కొను గోలు దారులను ఆకర్షించేందుకు కార్బైడ్‌ ఉప యోగించడంతో అనారోగ్య పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఏడాది రైతులకు నష్టమే.. మండల పరిధిలోని పరిసర ప్రాంతాల్లో ఉన్నమామిడి రైతులు నష్టాలు చవిచూసే పరిస్థితి ఏర్పడింది. నేను పది ఎకరాల్లో మామిడి చెట్లు పెంచుతున్నాను. ఈ ఏడాది అధిక దిగు బడివస్తుందని ఆశపడ్డాను. చీడ, పీడల వల్ల దిగుబడి తగ్గింది. పెట్టుబడి మాత్రం అధికంగా పెట్టాను. దిగుబడి లేకపో వడంతో నష్టమే మిగిలింది. – కొమ్మ వెంకటరమణ, రైతు

➡️