వర్షంతో ఉపశమనం

Jun 16,2024 00:26 #Rain
Seetjhammadara Rain

ప్రజాశక్తి-యంత్రాంగం సీతమ్మధార : శనివారం ఉదయం నుంచి ఎండ, ఉక్కపోతతో ప్రజలు అవస్థలకు గురయ్యారు. సాయంత్రం పడిన వర్షానికి ప్రజలందరూ కాసేపు చల్లదనాన్ని ఆస్వాదించారు. సీతమ్మధార, పౌర గ్రంథాలయంలో చెట్లు పడిపోవడంతో రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వెంటనే స్థానిక ప్రజలు స్పందించి చెట్టుకొమ్మలు తొలగించారు. పౌర గ్రంథాలయంలో పడిపోయిన చెట్టును విద్యార్థులు తొలగించారు.ఉరుములతో కూడిన గాలి వాన పెందుర్తి : 97, 95, 94, 93, 92 వార్డు పరిధి పెందుర్తి, చినముసిడివాడ, పురుషోత్తపురం, వేపగుంట నాయుడుతోట తదితర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన చిరుజల్లులు కురిశాయి. ఉదయం నుంచి ఎండతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షంతో ఒక్కసారిగా ఉపశమనం పొందారు. చిరు జల్లులు కారణంగా తర్వాత ఉక్కపోతతో అల్లాడారు. గత కొద్దిరోజులుగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో ఈ చిరుజల్లులకు ఆవిరి బయటకు రావడంతో ఒక్కసారిగా ప్రజలు ఉక్క పోతతో అల్లాడిపోయారు

➡️