కిరికిరి వ్యవహారాలను తిప్పికొట్టండి

Apr 18,2024 21:18

ప్రజాశక్తి-విజయనగరంకోట: రాష్ట్రానికి అభివృద్ధి, సంక్షేమం అనేవి రెండు కళ్లు అని, కానీ వైసిపి ప్రభుత్వం సంక్షేమమే తప్ప అభివృద్ధిని పట్టించుకోలేదని విజయనగరం పార్లమెంట్‌ టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, నియోజకవర్గ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం అశోక్‌ బంగ్లాలో 41వ వార్డు నుండి 50వ వార్డులకు సంబంధించి న వార్డు కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్‌ అభ్యర్థులు, యువత కమిటీ, మహిళా కమిటీ, యూనిట్‌ ఇంచార్జ్‌, బూత్‌ ఇన్‌ఛార్జిలతో సమావేశమయ్యారు. నేడు కలిశెట్టి అప్పలనాయుడు నామినేషన్‌విజయనగరం పార్లమెంట్‌ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం కలెక్టరేట్‌ లో నామినేషన్‌ వేయనున్నారు. ఉదయం 10.30లకు విజయనగరం టిడిపి కార్యాలయం అశోక్‌ బంగ్లా నుంచి కార్యకర్తలు, నాయకులు ర్యాలీ గా బయలు దేరి వెళ్లి కలెక్టరేట్‌ చేరుకున్న తర్వాత నామినేషన్‌ పత్రాలను 10.50నిమిషాలకు సమర్పించనున్నారు. అతిది విజయలక్ష్మి మాట్లాడుతూ మమ్మల్ని మమ్మల్నిగా చూడాలని, తన తండ్రితో పోల్చవద్దుని అన్నారు. కలిశెట్టి అప్పలనాయుడు సామాన్య కార్యకర్త నుండి ఈరోజు ఎంపి అభ్యర్థి స్థాయికి ఎదగడం గొప్ప విషయమన్నారు. నాయకులు, కార్యకర్తలు టిడిపి సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ పెండింగ్‌ ఉన్న ప్రాజెక్టులు అన్నీ కూడా పార్టీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల అధ్యక్షుడు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటాపోలినాయుడు, బిసి సంఘం రాష్ట్ర నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌బాబు, పిళ్లా విజరుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. వైసిపిలో చేరిన టిడిపి నాయకులు విజయనగరం టౌన్‌ : విజయనగరం వైసిపి జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు సమక్షంలో ధర్మపురిలో ఉన్న తన నివాసం వద్ద గరివిడి మండలం దువ్వాం గ్రామానికికి చెందిన 40 కుటుంబాలు ఆ గ్రామ సర్పంచ్‌ రవి, ఎంపిటిసి కృష్ణవేణి, మండల పార్టీ అధ్యక్షులు కొణిశ కృష్ణం నాయుడు, మీసాల విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో వైసిపి లో చేరారు. వీరికి మజ్జిశ్రీనివాసరావు పార్టీ కండువాలు వేశారు.

➡️