ఆడుదాం ఆంధ్రా గోడపత్రికను ఆవిష్కరించిన మంత్రి రోజా

Dec 9,2023 13:34 #Kakinada
roja release atadukundam andhra poster

ప్రజాశక్తి – సామర్లకోట రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుండి సచివాలయాల పరిధిలో ప్రారంభించనున్న ఆడుదాం ఆంధ్రా గోడపత్రికను శనివారం రాష్ట్ర పర్యాటక మంత్రి ఆర్కే రోజా ఆవిష్కరించారు. సామర్లకోట భీమేశ్వర ఆలయం వద్ద రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దాపురం నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో యువత విద్యార్థులు ఆసక్తి గలవారు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షుడు దవులూరి సుబ్బారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ లు ఉబా జాన్ మోజేస్, నెక్కంటి సాయి ప్రసాద్, కౌన్సిలర్లు సేపేని సురేష్, పాగా సురేష్, వైసిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

➡️