కైట్ లో సంక్రాంతి సంబరాలు

Jan 10,2024 15:58 #Kakinada, #Sankranti festival

ప్రజాశక్తి – తాళ్లరేవు(కాకినాడ-జిల్లా) : కోరంగిలోని కైట్ విద్యాసంస్థల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ విద్యావేత్త, బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ భోగి మంటను కైట్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రభాకర్ శర్మ మాట్లాడారు. కనుమరుగవుతున్న సంస్కృతి సంప్రదాయాలను భావితరానికి అందించే బాధ్యత యువతరానిదే అన్నారు. విద్యాసంస్థల చైర్మన్ పోతుల వెంకట విశ్వం ప్రతి ఏటా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ విద్యార్థులలో భారతీయ సంప్రదాయ విలువలు పెంపొందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఊరేగింపు, విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వై .రామకృష్ణ, డి. రేవతి, ఉపాధ్యాయులు ఐశ్వర్య, సురేఖ, రామ్ కిరణ్, మధు, కాశీ రావు తదితరులు పాల్గొన్నారు.

➡️