అంగన్వాడీల సమ్మెకు సర్పంచుల మద్దతు

Dec 19,2023 15:20 #Anganwadi strike, #East Godavari

ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తూర్పుగోదావరి) : అంగన్వాడీ కార్మికులకు తమ నైతిక మద్దతు తెలియజేస్తున్నట్లు మండలంలోని తాడిపర్రు, కే సావరం, సూర్యారావుపాలెం గ్రామాల సర్పంచ్ లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత వారం రోజులుగా సమ్మె నిర్వహిస్తున్న మండల అంగన్వాడి కార్మికులు మంగళవారం పెరవలి ప్రాజెక్టు ఐ సి డి ఎస్ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా సర్పంచ్ లు సమ్మె చేస్తున్న ప్రాంతానికి వెళ్లి, మద్దతుగా వారితో పాటు సమ్మెలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అన్ని వాగ్దానాలు నెరవేర్చాలని, దానిలో భాగంగా అంగన్వాడీ కార్మికుల సమస్యల పై సత్వర నిర్ణయం తీసుకోవాలన్నారు. గత వారం రోజులుగా అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు ఆహారం అందజేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కరుటూరి నరేంద్రబాబు, నార్ని రామకృష్ణ, మెండే శ్రీనివాస్, ఉండ్రాజవరం సెక్టార్ లీడర్ ఎస్ రంగనాయకమ్మ, పెరవలి ప్రాజెక్టు ప్రెసిడెంట్ కే లక్ష్మి కుమారి, ఎం జానకి, కె ఎన్ ఎస్ ప్రసన్నకుమారి, సిహెచ్ జ్యోతి, ఎమ్ వి నరసమ్మ, జి సువర్ణ లత, ఉషారాణి, పి గిరిజ, నిర్మల, కె విజయ కుమారి, కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️