సచివాలయ సిబ్బంది ప్రజలకు మెరుగైన సేలందించాలి : జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు

Nov 28,2023 16:45 #Chittoor District

ప్రజాశక్తి-వి కోట : ప్రభుత్వ పాలన ప్రజలకు చేరవ చేసే లక్షణం తో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ లో పనిచేసే సిబ్బంది ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని చిత్తూరు జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన వి కోటలోని అంబేద్కర్ సచివాలయాన్ని వారు ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ నందు సి. ఎల్ ఎంట్రీ చేయాలని మూమెంట్ రిజిస్టర్ నందు క్యాంప్ వివరాలు నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు త్రాగునీటి ఎదుటి తలెత్తకుండా తల చర్యలు తీసుకోవాలని పారిశుధ్యం మెరుగుకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. వైయస్సార్ గృహ నిర్మాణ పథకం కింద నిర్మితమవుతున్న గృహాలను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఖాజీపేట జెడ్పి ఉర్దూ హై స్కూల్ ను వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ విద్యాబోధన, మధ్యాహ్నం పథకంతో పాటు మౌలిక సదుపాయాల అమలును అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి తగు చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు.

➡️