ఆరుగురు సజీవదహనం

May 16,2024 00:17

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా, చిలకలూరిపేట : సొంతూరిపై మమకారం.. ఓటు వేయాలనే లక్ష్యంతో వారంతా స్వగ్రామాలకు వచ్చారు. తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. బంధుమిత్రులు, పిల్లలతో రెండు, మూడు రోజుల పాటు సరదాగా, సంతోషంగా గడిపారు. ఉద్యోగ విధులకు వెళ్లాలని తాము పనిచేసే ప్రాంతాలకు ఓ ప్రైవేటు టావెల్స్‌ బస్సులో మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణమ య్యారు. మార్గ మధ్యలోనే మృత్యువు టిప్పర్‌ రూపంలో దూసుకొచ్చింది. బస్సు, డ్రైవర్‌, ట్రిప్పర్‌ డ్రైవర్‌తో సహా ఆరుగరి ప్రాణాలను బలిగొంది. బస్సులోని మిగతా ప్రయాణి కులు కళ్లు తెరిచేలోపే ఆగ్ని కీలలు ఎగసి పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. బాపట్ల జిల్లా చినగంజాం మండలం నీలయాపాలెం, చినగంజాం, గొనసపూడి గ్రామాలకు చెందిన 40 మందితో ప్రైవేటు బస్సు హైదరాబాదుకు వెళ్తుండగా బుధవా రం వేకువజాము 2 గంటల సమయంలో అన్నభొట్లవారిపాలెం, పసుమర్రు గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢకొీట్టింది. రెండు వాహనాలకు నిప్పంటు కుని చిన్నగంజాం మండలం నీలాయపా లేనికి చెందిన భార్యాభర్తలు ఉప్పుగుండూరి కాశీబహ్మేశ్వరరావు (63), లక్ష్మి (55), వారి మనుమరాలు ముప్పరాజు ఖ్యాతి శ్రీసాయి (7), అదే మండలం గొనసపూడికి దావూ లూరి శ్రీనివాసరావు (34), మధ్యప్రదేశ్‌కు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ హరిసింగ్‌, చీరాలకు చెందిన బస్సు డ్రైవర్‌ షేక్‌ మస్తాన్‌షరీష్‌ (45) సజీవ దహనమయ్యారు. 20 మంది గాయపడ్డారు.

➡️