వ్యయ పరిశీలనపైప్రత్యేక దృష్టి

ప్రజాశక్తి – కడప వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే వ్యయ పరిశీలనపై ప్రత్యేక దష్టి సారించాలని రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగం (రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌) ఎన్నికల నిర్వహణ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ లోని బోర్డు మీటింగ్‌ హాల్‌లో జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు రామరాజుతో కలిసి ఎన్నికల వ్యయ పరిశీలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాకు కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు రమేష్‌ భారతి కె.ఎస్‌, సత్యేంద్ర సింగ్‌ మెహరా, రాజేష్‌ కుమార్‌ మీనా, జెసి గణేష్‌ కుమార్‌, కడప నగర కమిషనర్‌ ప్రవీణ్‌ చంద్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, డిఆర్‌ఒ గంగాధర్‌ గౌడ్‌, ఎఎస్‌పి సుధాకర్‌ హాజరయ్యారు. సమావేశంలో ముందుగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లాలో సార్వత్రిక ఎన్నికల సన్నద్ధత కోసం జిల్లా యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రత్యేక వ్యయ పరిశీలకులు నీనా నిగంకు వివరించారు. జిల్లాలోని 7 నియోజక వర్గాలు, అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఒంటిమిట్ట, సిద్దవటం మండ లాలతో కలిపి మొత్తం 2035 పొలింగ్‌ కేంద్రా లతో పాటు 22 క్రిటికల్‌ పోలింగ్‌ స్టేషన్లలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిం చామని చెప్పారు. జిల్లాలో మొత్తం 16 విభా గాలకు సంబంధించి నోడల్‌ అధికారులు, 7 నియోజక వర్గాలకు రిటర్నింగ్‌ అధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు సజావుగా జరుగు తున్నాయన్నారు. రెండు విడతల్లో పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించామని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌, హోమ్‌ ఓటుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని వివ రించారు. కౌంటింగ్‌ ప్రక్రియకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ఎన్నికల ప్రవర్తనా నియ మావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేసుకున్నామని ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎంసిసి, వ్యయ పర్యవేక్షణ, సమాచార సాంకేతికత, ఈవీఎం ల నిర్వహణ, పోస్టల్‌ బ్యాలెట్‌ ల నిర్వహణ, ఎంసిఎంసి తదితర అంశాలకు నోడల్‌ ఆఫీసర్లను కేటాయించామని వారికి వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఎన్నికలలో పోటీ చేయబోయే ప్రతి ఒక్క అభ్యర్థికి సమాన అవకాశాలు ఉండాలన్నారు. గతంలో జరిగిన అనుభవాలను దష్టిలో పెట్టుకుని ఎఫ్‌ఎస్‌ టి, ఎస్‌ఎస్‌ టి తదితర బందాల నిఘా ఏర్పాట్లు, పర్యవేక్షణ చర్యలు బాగున్నాయని వీటిని ఇలాగే కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ జిల్లాలో జరిగే ఎన్నికలకు విశేషమైన ప్రాముఖ్యం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే వ్యయ పరిశీలనపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కాగా జిల్లాలో ఎన్నికల సన్నద్ధత సంతప్తికరంగా ఉందని, ఎన్నికలకు కేటాయించిన సిబ్బంది పనితీరు ఉత్సాహకరంగా, ఇదే సన్నద్ధతను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగించి ఎన్నికల నిర్వహణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో ఎక్స్‌పెండెచర్‌ కమిటీ సభ్యులు ఆనంద్‌ నాయక్‌, నాగరాజ రావు, వెంకటేశ్వర్లు, 16 విభాగాలకు చెందిన నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ పరిశీలన కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు పరిశీలించారు. కంట్రోల్‌ రూమ్‌లోని అన్ని విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధులను వారు తనిఖీ చేశారు. కార్యక్రమంలో సంబంధిత ఎన్నికల నోడల్‌ అధికారులు, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది పాల్గొన్నారు.ఏర్పాట్లు చేసుకున్నామని ఎక్కడా ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఎంసిసి, వ్యయ పర్యవేక్షణ, సమాచార సాంకేతికత, ఈవీఎం ల నిర్వహణ, పోస్టల్‌ బ్యాలెట్‌ ల నిర్వహణ, ఎంసిఎంసి తదితర అంశాలకు నోడల్‌ ఆఫీసర్లను కేటాయించామని వారికి వివరించారు. అనంతరం రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ఎన్నికలలో పోటీ చేయబోయే ప్రతి ఒక్క అభ్యర్థికి సమాన అవకాశాలు ఉండాలన్నారు. గతంలో జరిగిన అనుభవాలను దష్టిలో పెట్టుకుని ఎఫ్‌ఎస్‌ టి, ఎస్‌ఎస్‌ టి తదితర బందాల నిఘా ఏర్పాట్లు, పర్యవేక్షణ చర్యలు బాగున్నాయని వీటిని ఇలాగే కొనసాగించాలన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ జిల్లాలో జరిగే ఎన్నికలకు విశేషమైన ప్రాముఖ్యం ఉందన్నారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా చేపట్టే వ్యయ పరిశీలనపై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. జిల్లాలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, సజావుగా పారద ర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. కాగా జిల్లాలో ఎన్నికల సన్నద్ధత సంతప్తికరంగా ఉందని, ఎన్నికలకు కేటా యించిన సిబ్బంది పనితీరు ఉత్సాహకరంగా, ఇదే సన్నద్ధతను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కొనసాగించి ఎన్నికల నిర్వ హణ ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. కార్యక్ర మంలో ఎక్స్‌పెండెచర్‌ కమిటీ సభ్యులు ఆనంద్‌ నాయక్‌, నాగరాజ రావు, వెంకటేశ్వర్లు, 16 విభాగాలకు చెందిన నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ పరిశీలన కలెక్టరేట్‌లోని జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంట ర్‌ను రాష్ట్ర ప్రత్యేక వ్యయ పరిశీలకులు పరిశీలించారు. కంట్రో ల్‌ రూమ్‌లోని అన్ని విభాగాల సిబ్బంది నిర్వహిస్తున్న విధు లను వారు తనిఖీ చేశారు. కార్యక్రమంలో సంబంధిత ఎన్ని కల నోడల్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️