టెన్త్‌ పరీక్షల స్పాట్‌ రెమ్యురేషన్‌ వెంటనే చెల్లించాలి

Apr 25,2024 21:52

 ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌ : జిల్లాలో పదో తరగతి పరీక్షలకు విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు, స్పాట్‌ వాల్యుయేషన్‌ రెమ్యునరేషన్‌ నిధులు ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లోకి వెంటనే జమ చేయాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు టి.రమేష్‌, ఎస్‌.మురళీమోహనరావు కోరారు. ఈ మేరకు గురువారం ఉపాధ్యాయ నాయకులతో కలిసి డిఇఒకు జి.పగడాలమ్మకు వినతిని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్పాట్‌ వాల్యుయేషన్‌కు సంబంధించి రూ.22 లక్షలు, పరీక్షలకు సంబంధించి రూ.11 లక్షలు వెంటనే చెల్లించాలని కోరారు. పార్వతీపురం మండలం పులిగుమ్మి టీచర్‌ ఎస్‌ఆర్‌ను పోగొట్టినప్పటికీ ఎంఇఒపై చర్యలు తీసుకోవాలని, వెంటనే సదరు ఎస్‌ఆర్‌ తయారు చేయడానికి ప్రోసిడింగ్‌ ఇవ్వాలని డిఇఒను కోరారు. ఈ సమస్యలపై డిఇఒ స్పందిస్తూ మూడు రోజుల్లో రెమ్యూనరేషన్‌ నిధులు ఉపాధ్యాయులకు చెల్లింపునకు చర్యలు చేపడతామని, అలాగే ఎస్సార్‌ ప్రొసీడింగ్స్‌ను ఇచ్చేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు.

➡️