అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలి

Dec 11,2023 21:40

నిరసన వ్యక్తం చేస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితులు, నాయకులు

                        పుట్టపర్తి రూరల్‌ : ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ, జనసేన నాయకులు డిమాండ్‌ చేశారు. అగ్రిగోల్డ్‌ కస్టమర్లు ఏజెంట్ల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్‌ బాధితులు ఏజెంట్లు సోమవారం పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన, దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శి అంజి, జనసేన పార్టీ నాయకులు బొగ్గరం శ్రీనివాసులు, కొత్తచెరువు పూల శివ తదితరులు మాట్లాడుతూఎన్నికల ముందు బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పదివేల రూపాయలు లోపు ఉన్న బాధితులకు అరకొరగా డబ్బులు చెల్లించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. కోట్ల రూపాయల విలువ చేసే అగ్రిగోల్డ్‌ భూములను కొంతమంది స్వాధీన పరుచుకుని బాధితులకు న్యాయం చేయకుండా కాలం గడుపుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్‌ ఏజెంట్లు షబ్బీర్‌ ఖాన్‌, నాగేంద్ర, నాగరాజు, మహమ్మద్‌ గౌస్‌, లక్ష్మిరెడ్డి, నాగేంద్ర, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

➡️