అభ్యర్థి ఎంపికపై పునరాలోచించండి : టిడిపి

Feb 28,2024 22:29

 సమావేశంలో పాల్గొన్న అసమ్మతి నాయకులు

               మడకశిర : నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపై అధిష్టానం పునరాలోచించాలని తెలుగుదేశం పార్టీ కన్వీనర్లు కోరారు. బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గంలోని ఆయా మండలాల కన్వీనర్లు మాట్లాడుతూ అభ్యర్థి సునీల్‌ కుమార్‌ ఎంపిక పట్ల పార్టీ అధ్యక్షులు చంద్రబాబు పునరాలోచించాలని కోరారు. లేకపోతే పార్టీకి, పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అగలి జడ్పిటిసి ఉమేష్‌,పట్టణ అధ్యక్షుడు మనోహర్‌, గుడిబండ మండల కన్వీనర్‌ మద్దనకుంటప్ప, మడకశిర మండల కన్వీనర్‌ లక్ష్మీనారాయణ, రొళ్ల మండల కన్వీనర్‌ దాసిరెడ్డి, అమరాపురం మండల కన్వీనర్‌ గణేష్‌, అగలి మండల కన్వీనర్‌ కుమార్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

➡️