అరాచక పాలనకు స్వస్తి పలుకుదాం : పల్లె

Mar 21,2024 22:03

స్థానికులతో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి

                 బుక్కపట్నం : వైసిపి ప్రభుత్వ అరాచక పాలనకు స్వస్తి పలుకుదామని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలోని సుందరయ్య కాలనీ, శివాలయం కాలనీలో మాజీ మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం చేపడుతున్న అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పుట్టపర్తి సమన్వయకర్త పత్తి చంద్రశేఖర్‌, సామకోటి ఆదినారాయణ, మండల కన్వీనర్‌ మల్లిరెడ్డి, జంగం వెంకట్రాముడు, మాజీ సర్పంచి సాకే యశోద, లావణ్య గౌడ్‌, గోపాలపురం గంగాధర్‌, సంజీవ రాయుడు, కరణం శ్రీరాములు,దాసరి శ్రీనివాసులు, తెలుగు యువత నాయకులు సుధీర్‌, సతీష్‌ రాయల్‌, మంజునాథ్‌,మన్సూర్‌, తదితరులు పాల్గొన్నారు.

పుట్టపర్తి క్రైమ్‌ : అరాచక పాలన అంతమొందించడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు ఎన్నికల్లో సైనికుల్లా పనిచేయాలని మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం టిడిపి కార్యాలయంలో టిడిపి, జనసేన నాయకుల కార్యకర్తల సమన్వయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లెతోపాటు కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, పివికెకె విద్యాసంస్థల చైర్మన్‌ పల్లె వెంకటకృష్ణకిషోర్‌ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పల్లె మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా ఈ ఎన్నికలలో పోరాడాల్సి ఉందన్నారు. ఓటర్లకు టిడిపి మేనిఫెస్టోలోని అంశాలను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి కన్వీనర్లు రామాంజనేయులు, విజయకుమార్‌, మైలే శంకర్‌, వలపు శ్రీనివాసులు, రామకృష్ణ, మలిరెడ్డి, జైచంద్ర, జనసేన కన్వీనర్లు మేకల ఈశ్వర్‌, జయరాం, శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️